Ooragumdavayya amta kobudumaa

ఊరకుండవయ్య అంత కోపుదుమా
Language

(॥పల్లవి॥)
ఊరకుండవయ్య అంత కోపుదుమా
గోర గీరి అప్పటిని కొసరేవు గాక

(॥ఊర॥)
నిగ్గుల మాటలు నీతో నేరుతుమా మమ్ము
సిగ్గులు వడఁగ నాడి చెనకేవు
దగ్గరి పైకొన నీతోఁ దగుదుమా
బెగ్గిలపు మా చన్నులు పిసికేవు గాక

(॥ఊర॥)
పొంచి నీతో నవ్వ నిన్నుఁ బోలుదుమా మమ్ము
మంచముపైకి రమ్మని మన్నించేవు
చంచుల నీరతులకుఁ జూలుదుమా
పంచల నా పెద్దకొప్పు పట్టేవు గాక

(॥ఊర॥)
వడి నీసతుల సరి వత్తుమా మమ్ముఁ
దడవి కాఁగిటఁగూడి తమకించేవు
యెడయక శ్రీ వేంకటేశ నీకె తగుదుమా
విడువక మాపై చొక్కు వేసేవు గాక

(||pallavi||)
ūraguṁḍavayya aṁta kobudumā
gora gīri appaḍini kŏsarevu gāga

(||ūra||)
niggula māḍalu nīdo nerudumā mammu
siggulu vaḍam̐ga nāḍi sĕnagevu
daggari paigŏna nīdom̐ dagudumā
bĕggilabu mā sannulu pisigevu gāga

(||ūra||)
pŏṁchi nīdo navva ninnum̐ boludumā mammu
maṁchamubaigi rammani manniṁchevu
saṁchula nīradulagum̐ jūludumā
paṁchala nā pĕddagŏppu paṭṭevu gāga

(||ūra||)
vaḍi nīsadula sari vattumā mammum̐
daḍavi kām̐giḍam̐gūḍi tamagiṁchevu
yĕḍayaga śhrī veṁkaḍeśha nīgĕ tagudumā
viḍuvaga mābai sŏkku vesevu gāga