Ooragumdaneeraa mammu nudigimchagaa

ఊరకుండనీరా మమ్ము నుడికించకా
Language

(॥పల్లవి॥)
ఊరకుండనీరా మమ్ము నుడికించకా
గారవించే నీ నవ్వు గాలమువో నాకు

(॥ఊరకుండ॥)
చిణుతనవ్వు నవ్వఁగా చెక్కు నొక్కి యెత్తి నన్ను
కఱఁచేవు మరికొంత కారింపే కాదా
తణి నీ మనసుననుఁ దలఁచిన ట్లుండు
గుఱిగా నదివో నాకు గుండెలోనీ అమ్ము

(॥ఊరకుండ॥)
మంచముపై నుండఁగాను మచ్చిక నావొద్దఁ బండి
ముంచి చేయి వేసే వది మోపే కాదా
యెంచి నీకుఁ జూడ నది యిచ్చక మైనట్లుండు
తెంచరాని పొద్దు వొద్దు దిగులువో నాకు

(॥ఊరకుండ॥)
భ్రమసి నేనుండఁగాను పట్టి నన్నుఁ గాఁగిలించి
తమకించే విది గొంత తగులే కాదా
అమర శ్రీవెంకటేశ ఆదరించి కూడితివి
చెమటలు నీకుఁ గాని సేసలువో నాకు

(||pallavi||)
ūraguṁḍanīrā mammu nuḍigiṁchagā
gāraviṁche nī navvu gālamuvo nāgu

(||ūraguṁḍa||)
siṇudanavvu navvam̐gā sĕkku nŏkki yĕtti nannu
kaṟam̐sevu marigŏṁta kāriṁpe kādā
taṇi nī manasunanum̐ dalam̐sina ṭluṁḍu
guṟigā nadivo nāgu guṁḍĕlonī ammu

(||ūraguṁḍa||)
maṁchamubai nuṁḍam̐gānu machchiga nāvŏddam̐ baṁḍi
muṁchi seyi vese vadi mobe kādā
yĕṁchi nīgum̐ jūḍa nadi yichchaga mainaṭluṁḍu
tĕṁcharāni pŏddu vŏddu diguluvo nāgu

(||ūraguṁḍa||)
bhramasi nenuṁḍam̐gānu paṭṭi nannum̐ gām̐giliṁchi
tamagiṁche vidi gŏṁta tagule kādā
amara śhrīvĕṁkaḍeśha ādariṁchi kūḍidivi
sĕmaḍalu nīgum̐ gāni sesaluvo nāgu