Ooragumdamgaa nubamalu seppi

ఊరకుండఁగా నుపమలు చెప్పి
Language

(॥పల్లవి॥)
ఊరకుండఁగా నుపమలు చెప్పి
తారుకాణలకుఁ దడవితినా

(॥ఊర॥)
చెదరినయలకలు చెంపల నవిగో
తుదకన్నుల నిద్దుర దేరీ
వుదుటునఁ దానేల వొడఁబరచీ నను
అదనసుద్దులు దను నడిగితినా

(॥ఊర॥)
తొటతొట మేననుఁ దొరిగెఁ జెమటలు
చిటిలీ గందము జిగిమేన
తటుకున నానలు తానేల పెట్టీని
నటనలనేఁ దను నమ్మనంటినా

(॥ఊర॥)
మోవిపైఁ గెంపులు ముసగస లాడీ
కావిరి మోమునఁ గళ దేరీ
శ్రీవేంకటేశుఁడు చేకొని నన్నేలె
సోవలఁ దను నే సొలసితినా

(||pallavi||)
ūraguṁḍam̐gā nubamalu sĕppi
tārugāṇalagum̐ daḍavidinā

(||ūra||)
sĕdarinayalagalu sĕṁpala navigo
tudagannula niddura derī
vuduḍunam̐ dānela vŏḍam̐barasī nanu
adanasuddulu danu naḍigidinā

(||ūra||)
tŏḍadŏḍa menanum̐ dŏrigĕm̐ jĕmaḍalu
siḍilī gaṁdamu jigimena
taḍuguna nānalu tānela pĕṭṭīni
naḍanalanem̐ danu nammanaṁṭinā

(||ūra||)
movibaim̐ gĕṁpulu musagasa lāḍī
kāviri momunam̐ gaḽa derī
śhrīveṁkaḍeśhum̐ḍu segŏni nannelĕ
sovalam̐ danu ne sŏlasidinā