(॥పల్లవి॥)
ఊరకుండఁ గదరే వువిదలాలా
మేరతోడివారికి మితిమీరవచ్చునా
(॥ఊర॥)
సలిగెగలవారికి సరసములాడవచ్చు
బలిమిగలవారికి పైకొనగవచ్చు
వలపుగలవారికి వాడికలు చూపవచ్చు
అలవోకవారికెల్లా ఆయా లంటవచ్చునా
(॥ఊర॥)
చుట్టరికపువారికి సుద్దులు చెప్పఁగవచ్చు
దిట్టతనపువారికి దీకొనవచ్చు
నెట్టుకొన్నవారికి నేరుపులు చూపవచ్చు
కట్టఁగడవారికెల్లాఁ గాఁతాళించవచ్చునా
(॥ఊర॥)
తగుగలులగలవారికి తమకము లెంచవచ్చు
సొగిసినవారికి సొలయవచ్చు
అగపడి శ్రీవేంకటాధిపతి నన్ను నేలె
వెగటైనవారికెల్లా వేసరించ వచ్చునా
(||pallavi||)
ūraguṁḍam̐ gadare vuvidalālā
meradoḍivārigi midimīravachchunā
(||ūra||)
saligĕgalavārigi sarasamulāḍavachchu
balimigalavārigi paigŏnagavachchu
valabugalavārigi vāḍigalu sūbavachchu
alavogavārigĕllā āyā laṁṭavachchunā
(||ūra||)
suṭṭarigabuvārigi suddulu sĕppam̐gavachchu
diṭṭadanabuvārigi dīgŏnavachchu
nĕṭṭugŏnnavārigi nerubulu sūbavachchu
kaṭṭam̐gaḍavārigĕllām̐ gām̐tāḽiṁchavachchunā
(||ūra||)
tagugalulagalavārigi tamagamu lĕṁchavachchu
sŏgisinavārigi sŏlayavachchu
agabaḍi śhrīveṁkaḍādhibadi nannu nelĕ
vĕgaḍainavārigĕllā vesariṁcha vachchunā