Ooragumdagaane yela vokkokkada gadiyimchevu

ఊరకుండగానే యేల వొక్కొక్కట గడియించేవు
Language

(॥పల్లవి॥)
ఊరకుండగానే యేల వొక్కొక్కట గడియించేవు
మేరతో నుండితేనే మెచ్చనిదాననా

(॥ఊర॥)
వొడయఁడ వందరికి వొకతెఁ జూచి నీవు
నడుమ నవ్వితే నేను నవ్వవచ్చునా
పడఁతినింతే నేను పక్కన వినయముతో
అడఁకువ నుండితేనే అలిగినదాననా

(॥ఊర॥)
వొనర మోహించి నీవు వొకతెగుణము లిట్టె
కొనియాడితే నేనుఁ గొనియాడేదా
నిను బెండ్లాడినదాన నేను కడు సిగ్గుతోడ
వొనరఁ దలవంచితే కినిసినదాననా

(॥ఊర॥)
వొక్కటై కాఁగిటఁ గూడి వొకతెకుఁ బ్రియపడి
మొక్కితే నేను నాపెకు మొక్కవలెనా
నిక్కపు శ్రీవేంకటేశ నీవేలినదాన నేను
చొక్కివుంటి నాపైపై నీసున నున్నదాననా

(||pallavi||)
ūraguṁḍagāne yela vŏkkŏkkaḍa gaḍiyiṁchevu
merado nuṁḍidene mĕchchanidānanā

(||ūra||)
vŏḍayam̐ḍa vaṁdarigi vŏgadĕm̐ jūsi nīvu
naḍuma navvide nenu navvavachchunā
paḍam̐tiniṁte nenu pakkana vinayamudo
aḍam̐kuva nuṁḍidene aliginadānanā

(||ūra||)
vŏnara mohiṁchi nīvu vŏgadĕguṇamu liṭṭĕ
kŏniyāḍide nenum̐ gŏniyāḍedā
ninu bĕṁḍlāḍinadāna nenu kaḍu siggudoḍa
vŏnaram̐ dalavaṁchide kinisinadānanā

(||ūra||)
vŏkkaḍai kām̐giḍam̐ gūḍi vŏgadĕgum̐ briyabaḍi
mŏkkide nenu nābĕgu mŏkkavalĕnā
nikkabu śhrīveṁkaḍeśha nīvelinadāna nenu
sŏkkivuṁṭi nābaibai nīsuna nunnadānanā