Ooragela doorevu voorivaarini

ఊరకేల దూరేవు వూరివారిని
Language

(॥పల్లవి॥)
ఊరకేల దూరేవు వూరివారిని
బీరములాడితిఁ గాక పెనఁగితినా

(॥॥)
రవ్వలు సేసితినా రచ్చల వేసితినా
నవ్వినవాఁడవు నీవే నాతితోను
ఇవ్వల నేఁడిది చూచి ఇంతులెల్లా నాడుకొంటే
దవ్వులనే వింటిఁ గాక తడవితినా

(॥॥)
పల్లదీఁడవంటినా పచ్చిచేఁత చూపితినా
చల్లినవాఁడవు నీవే సతి సేస
చల్లఁగా విందుకిందరు సన్నలు సేసుకోఁగా
వొల్లనే చూచితిఁ గాక వొరయవచ్చితినా

(॥॥)
యీడులు వెట్టితినా యెరుక నేసుకొంటినా
కూడినవాఁడవు నీవే కోమలాంగిని
తోడనె శ్రీ వేంకటేశ తొల్లె యలమేల్మంగను
వీడె మందుకొంటిఁ గాక వేగులు వెట్టితినా

(||pallavi||)
ūragela dūrevu vūrivārini
bīramulāḍidim̐ gāga pĕnam̐gidinā

(||||)
ravvalu sesidinā rachchala vesidinā
navvinavām̐ḍavu nīve nādidonu
ivvala nem̐ḍidi sūsi iṁtulĕllā nāḍugŏṁṭe
davvulane viṁṭim̐ gāga taḍavidinā

(||||)
palladīm̐ḍavaṁṭinā pachchisem̐ta sūbidinā
sallinavām̐ḍavu nīve sadi sesa
sallam̐gā viṁdugiṁdaru sannalu sesugom̐gā
vŏllane sūsidim̐ gāga vŏrayavachchidinā

(||||)
yīḍulu vĕṭṭidinā yĕruga nesugŏṁṭinā
kūḍinavām̐ḍavu nīve komalāṁgini
toḍanĕ śhrī veṁkaḍeśha tŏllĕ yalamelmaṁganu
vīḍĕ maṁdugŏṁṭim̐ gāga vegulu vĕṭṭidinā