Ooragela doorevu voorivaarinellaanu

ఊరకేల దూరేవు వూరివారినెల్లాను
Language

(॥పల్లవి॥)
ఊరకేల దూరేవు వూరివారినెల్లాను
చేరి నా వెూము చూచితే చేయెత్తి మొక్కితినే

(॥॥)
చింతదీర నతఁడు నీచేతికి లోనై వుండఁగా
పంతములాడుకోనేలే పలుమారును
వింతవారిఁ గూడకుండా వేడుకైతే నింకా నీవు
కాంతుని నీమొలఁ గుచ్చి కట్టుకొనఁగదవే

(॥॥)
చెలువుఁ డీత డిదె నీకుఁ జెప్పినట్టు సేయఁగాను
యెలమి నీరపము గా కిఁక నెన్నఁడే
కలసి నీ వొక్కతెవే కైకొన నాసగలితే
తలమీఁదఁ బెట్టుకొని దాఁచుకొనఁగదవే

(॥॥)
శ్రీ వేంకటేశుఁడు నిన్నుఁజేరి పెద్దసేయఁగాను
సేవలు సేతేవుగాక సిగ్గులేడవే
యీవల నన్నితఁ డేలె నింకా నీకు వలసితే
భావించి కాఁగిలించుక బడివాయనీకువే

(||pallavi||)
ūragela dūrevu vūrivārinĕllānu
seri nā vĕూmu sūside seyĕtti mŏkkidine

(||||)
siṁtadīra nadam̐ḍu nīsedigi lonai vuṁḍam̐gā
paṁtamulāḍugonele palumārunu
viṁtavārim̐ gūḍaguṁḍā veḍugaide niṁkā nīvu
kāṁtuni nīmŏlam̐ guchchi kaṭṭugŏnam̐gadave

(||||)
sĕluvum̐ ḍīda ḍidĕ nīgum̐ jĕppinaṭṭu seyam̐gānu
yĕlami nīrabamu gā kim̐ka nĕnnam̐ḍe
kalasi nī vŏkkadĕve kaigŏna nāsagalide
talamīm̐dam̐ bĕṭṭugŏni dām̐sugŏnam̐gadave

(||||)
śhrī veṁkaḍeśhum̐ḍu ninnum̐jeri pĕddaseyam̐gānu
sevalu sedevugāga sigguleḍave
yīvala nannidam̐ ḍelĕ niṁkā nīgu valaside
bhāviṁchi kām̐giliṁchuga baḍivāyanīguve