ఊరకేల దాఁచేవు వుదుటు నీచేఁతలు
(॥పల్లవి॥)
ఊరకేల దాఁచేవు వుదుటు నీచేఁతలు
యేరీతి నీవుండినాను యెవ్వరేమనేరు
(॥॥)
వింతచెలు లుండఁగాను వెలఁదితోఁ జెవిలోన
మంతనాన నీ వప్పుడు మాటలాడవా
ఇంతలో నేఁటికి బొంకనేమాయ నేమిసేసినా
చెంతలమగవాఁడవు చెల్లదా నీకిపుడు
(॥॥)
కాకుసేసిరంటాను కడవా రెఱఁగకుండా
ఆకెయిచ్చిన వుంగర మందుకొనవా
నీ కేల సిగ్గువడ నేఁడు గొత్తలా యివి
యీకడ నీయిచ్చరాజ వేల లోఁగే విపుడు
(॥॥)
వలచి శ్రీవేంకటేశ వనితల మందిలించి
అలమేలుమంగ నురమందు నుంచవా
కలసితి విటు నన్నుఁ గపటము లిఁకనేల
బలిమికాఁడ వౌదువు పదరకు మిపుడు
(||pallavi||)
ūragela dām̐sevu vuduḍu nīsem̐talu
yerīdi nīvuṁḍinānu yĕvvaremaneru
(||||)
viṁtasĕlu luṁḍam̐gānu vĕlam̐didom̐ jĕvilona
maṁtanāna nī vappuḍu māḍalāḍavā
iṁtalo nem̐ṭigi bŏṁkanemāya nemisesinā
sĕṁtalamagavām̐ḍavu sĕlladā nīgibuḍu
(||||)
kāgusesiraṁṭānu kaḍavā rĕṟam̐gaguṁḍā
āgĕyichchina vuṁgara maṁdugŏnavā
nī kela sigguvaḍa nem̐ḍu gŏttalā yivi
yīgaḍa nīyichcharāja vela lom̐ge vibuḍu
(||||)
valasi śhrīveṁkaḍeśha vanidala maṁdiliṁchi
alamelumaṁga nuramaṁdu nuṁchavā
kalasidi viḍu nannum̐ gabaḍamu lim̐kanela
balimigām̐ḍa vauduvu padaragu mibuḍu