ఊరకే వున్నదాన న న్నొరయకురే
(॥పల్లవి॥)
ఊరకే వున్నదాన న న్నొరయకురే
నేరుపులు మీతో నే నెరపనేలే
(॥ఊర॥)
యితరు లయ్యాతని కిచ్చకము లాడితేను
కుతదీర మిమ్ము నిట్టె కోపించనేలే
అతఁడు సేసినచేఁత కాతనినే యందుఁగాక
మితిమీరినమాఁటలు మీతోనేలే
(॥ఊర॥)
తోడువచ్చినసతులు దోమటిదొడికించితే
సూడుఁబాడు వట్టి మిమ్ముసొలయనేలే
వీడెమిచ్చేవిభునినే వెల్లవిరి సేతుఁగాక
పాడిపంతముల మిమ్ముఁ బరచనేలే
(॥ఊర॥)
బడివాయ నీయింతులు బలిమిఁ గూడింపించితే
పెడమరలి మీతోను పెనఁగనేలే
అడరి శ్రీవేంకటేశుఁ డాతఁడు నే నొక్కటైతి
చిడుముడి మిమ్ము నవ్వి చిమ్మరేఁచనేలే
(||pallavi||)
ūrage vunnadāna na nnŏrayagure
nerubulu mīdo ne nĕrabanele
(||ūra||)
yidaru layyādani kichchagamu lāḍidenu
kudadīra mimmu niṭṭĕ kobiṁchanele
adam̐ḍu sesinasem̐ta kādanine yaṁdum̐gāga
midimīrinamām̐ṭalu mīdonele
(||ūra||)
toḍuvachchinasadulu domaḍidŏḍigiṁchide
sūḍum̐bāḍu vaṭṭi mimmusŏlayanele
vīḍĕmichchevibhunine vĕllaviri sedum̐gāga
pāḍibaṁtamula mimmum̐ barasanele
(||ūra||)
baḍivāya nīyiṁtulu balimim̐ gūḍiṁpiṁchide
pĕḍamarali mīdonu pĕnam̐ganele
aḍari śhrīveṁkaḍeśhum̐ ḍādam̐ḍu ne nŏkkaḍaidi
siḍumuḍi mimmu navvi simmarem̐sanele