Oorage vumdide ninnu voorellaa neṟimgeru

ఊరకే వుండితే నిన్ను వూరెల్లా నెఱిఁగేరు
Language

(॥పల్లవి॥)
ఊరకే వుండితే నిన్ను వూరెల్లా నెఱిఁగేరు
దూరువచ్చీ సుమ్మీ నీవు దొరపాటివాఁడవు

(॥ఊర॥)
నిలువుఁగస్తూరి పూఁత నీమేన నలఁదుకో
చెలఁగి చీఁకటితప్పు సేసేవాఁడవు
తలఁగక సేమంతులదండలు నిండా వేసుకో
తొలువెన్నముద్దలెల్లా దొంగిలేటివాఁడవు

(॥ఊర॥)
వడిఁ బైఁడిపచ్చడము వల్లెవాటు వేసుకో
చిడుముడిఁ జీరలు దీసేవాఁడవు
కడు నీవు పొద్దొకసింగారాలు సేసుకో
తొడికి ఆఁటదాని నెత్తుకవచ్చేవాఁడవు

(॥ఊర॥)
మితిలేని హారములు మెడనిండాఁ గట్టుకో
రతి నలమేల్మంగవురమువాఁడవు
ఇతవై శ్రీవేంకటేశ ఇదె మమ్ము నేలుకో
సతుల వేలసంఖ్యల సంతరించేవాఁడవు

(||pallavi||)
ūrage vuṁḍide ninnu vūrĕllā nĕṟim̐geru
dūruvachchī summī nīvu dŏrabāḍivām̐ḍavu

(||ūra||)
niluvum̐gastūri pūm̐ta nīmena nalam̐dugo
sĕlam̐gi sīm̐kaḍidappu sesevām̐ḍavu
talam̐gaga semaṁtuladaṁḍalu niṁḍā vesugo
tŏluvĕnnamuddalĕllā dŏṁgileḍivām̐ḍavu

(||ūra||)
vaḍim̐ baim̐ḍibachchaḍamu vallĕvāḍu vesugo
siḍumuḍim̐ jīralu dīsevām̐ḍavu
kaḍu nīvu pŏddŏgasiṁgārālu sesugo
tŏḍigi ām̐ṭadāni nĕttugavachchevām̐ḍavu

(||ūra||)
midileni hāramulu mĕḍaniṁḍām̐ gaṭṭugo
radi nalamelmaṁgavuramuvām̐ḍavu
idavai śhrīveṁkaḍeśha idĕ mammu nelugo
sadula velasaṁkhyala saṁtariṁchevām̐ḍavu