Oorage vumdenamte vummagilee valabulu

ఊరకే వుండేనంటే వుమ్మగిలీ వలపులు
Language

(॥పల్లవి॥)
ఊరకే వుండేనంటే వుమ్మగిలీ వలపులు
యేరీతి మన్నించేవో ఇఁక నీచి త్తము

(॥॥)
తలెత్తి చూడకుండితే తనివియుఁ దీరదు
సొలసితేఁగాని వాసులు మించవు
తెలియమాటాడకుండితే నొక్కమనసు గాదు
చెలఁగి విన్నపాలెల్లాఁ జేసితి నీచిత్తము

(॥॥)
సరసమాడితే గానీ చవులెల్లా రేగవు
సొరదిఁ గూచుండక సొంపులు వుట్టదు
తెరలోనికిఁ దియ్యక తీర దెంతైనా సిగ్గు
సరవి నివెల్లా జాడలు నీచిత్తము

(॥॥)
తనువులు సోఁకక తనివో దెంతైనాను
ననువునఁ బెనఁగక నాఁటదు ప్రేమ
యెనసితివి శ్రీ వేంకటేశ ఇంతలో నన్ను
కనుఁగొంటి నీమేలు గట్టిగా నీచిత్తము

(||pallavi||)
ūrage vuṁḍenaṁṭe vummagilī valabulu
yerīdi manniṁchevo im̐ka nīsi ttamu

(||||)
talĕtti sūḍaguṁḍide taniviyum̐ dīradu
sŏlasidem̐gāni vāsulu miṁchavu
tĕliyamāḍāḍaguṁḍide nŏkkamanasu gādu
sĕlam̐gi vinnabālĕllām̐ jesidi nīsittamu

(||||)
sarasamāḍide gānī savulĕllā regavu
sŏradim̐ gūsuṁḍaga sŏṁpulu vuṭṭadu
tĕralonigim̐ diyyaga tīra dĕṁtainā siggu
saravi nivĕllā jāḍalu nīsittamu

(||||)
tanuvulu som̐kaga tanivo dĕṁtainānu
nanuvunam̐ bĕnam̐gaga nām̐ṭadu prema
yĕnasidivi śhrī veṁkaḍeśha iṁtalo nannu
kanum̐gŏṁṭi nīmelu gaṭṭigā nīsittamu