ఊరకే వుండఁగరాదు వోరువరాదు చూచి
(॥పల్లవి॥)
ఊరకే వుండఁగరాదు వోరువరాదు చూచి
నేరుపరి నీ సుద్దులు నీకే తెలుసును
(॥ఊర॥)
పచ్చిమాటలాడఁగాను పడఁతితో నవ్వేవు
పెచ్చురేఁగి నీకివి ప్రియమాయనా
రచ్చల నివి వింటేను రమణులు నవ్వరా
నిచ్చలు నీసుద్దులివి నీకే తెలుసును
(॥ఊర॥)
కోరి మర్మాలంటఁగాను కూరిమిఁ జెంగలించేవు
పేరడిగా నీకిది ప్రియమాయనా
యీరీతి చూచినవారు యెంత లోలుఁడనరా
నీరాఁపుసుద్దులు నీకే తెలుసును
(॥ఊర॥)
గట్టి చన్నుల నొత్తితే కళదాఁకి బ్రమసేవు
పెట్టువలపులు నీకుఁ బ్రియమాయనా
యిట్టే శ్రీవేంకటేశ యెనసితివిటు నన్ను
నెట్టుకొన్న నీసుద్దులు నీకే తెలును
(||pallavi||)
ūrage vuṁḍam̐garādu voruvarādu sūsi
nerubari nī suddulu nīge tĕlusunu
(||ūra||)
pachchimāḍalāḍam̐gānu paḍam̐tido navvevu
pĕchchurem̐gi nīgivi priyamāyanā
rachchala nivi viṁṭenu ramaṇulu navvarā
nichchalu nīsuddulivi nīge tĕlusunu
(||ūra||)
kori marmālaṁṭam̐gānu kūrimim̐ jĕṁgaliṁchevu
peraḍigā nīgidi priyamāyanā
yīrīdi sūsinavāru yĕṁta lolum̐ḍanarā
nīrām̐pusuddulu nīge tĕlusunu
(||ūra||)
gaṭṭi sannula nŏttide kaḽadām̐ki bramasevu
pĕṭṭuvalabulu nīgum̐ briyamāyanā
yiṭṭe śhrīveṁkaḍeśha yĕnasidiviḍu nannu
nĕṭṭugŏnna nīsuddulu nīge tĕlunu