Oorage vumdamgaraadu vorasi yadugaraadu

ఊరకే వుండఁగరాదు వొరసి యడుగరాదు
Language

(॥పల్లవి॥)
ఊరకే వుండఁగరాదు వొరసి యడుగరాదు
తారుకాణించుకోవలె తప్పులు లేకుండాను

(॥ఊర॥)
కొలువులోపల నుండి కొమ్మ నీతో నవ్వఁగాను
చెలరేఁగి నీవెంత సిగ్గువడేవు
యలమి మీలో నవి యెటువంటి మర్మములో
తెలుసుకోవలె మాకు తేటతెల్లమిగను

(॥ఊర॥)
పగటున మోహించి పడఁతి సన్నసేయఁగా
మొగము చూచి నీవెంత మూసి దాఁచేవు
వొగి మీలో నివి యెట్టి వొడఁబాటు సుద్దులో
తగ విచారించవలె తనియుదీరఁగను

(॥ఊర॥)
ముందు ముందుగా నీకు ముదిత మోవియ్యఁగాను
సందడిలోననే వుండి చవి గొనేవు
అంది శ్రీ వేంకటేశుఁడ అట్టె నన్ను నేలితివి
పొందులు చూడఁగవలె పొందొక వింతలుగా

(||pallavi||)
ūrage vuṁḍam̐garādu vŏrasi yaḍugarādu
tārugāṇiṁchugovalĕ tappulu leguṁḍānu

(||ūra||)
kŏluvulobala nuṁḍi kŏmma nīdo navvam̐gānu
sĕlarem̐gi nīvĕṁta sigguvaḍevu
yalami mīlo navi yĕḍuvaṁṭi marmamulo
tĕlusugovalĕ māgu teḍadĕllamiganu

(||ūra||)
pagaḍuna mohiṁchi paḍam̐ti sannaseyam̐gā
mŏgamu sūsi nīvĕṁta mūsi dām̐sevu
vŏgi mīlo nivi yĕṭṭi vŏḍam̐bāḍu suddulo
taga visāriṁchavalĕ taniyudīram̐ganu

(||ūra||)
muṁdu muṁdugā nīgu mudida moviyyam̐gānu
saṁdaḍilonane vuṁḍi savi gŏnevu
aṁdi śhrī veṁkaḍeśhum̐ḍa aṭṭĕ nannu nelidivi
pŏṁdulu sūḍam̐gavalĕ pŏṁdŏga viṁtalugā