ఊరకే విఱ్ఱవీఁగేవు వువిదలలోననెల్లా
(॥పల్లవి॥)
ఊరకే విఱ్ఱవీఁగేవు వువిదలలోననెల్లా
యీరీతి నుండితేను నాయీడుదానవైతివా
(॥॥)
పంతముతో బిగిసితే పగటుదానవైతివా
సంతసుద్దులు చెప్పితే జాణవైతివా
బంతిఁ గూచుండితేనే పట్టపుదేవి వైతివా
వంతుతోడ వలపించవలెఁ గాక విభుని
(॥॥)
సారె సారె నవ్వితేనే చనవరివైతివా
తోరపుఁ గొప్పు వెట్టితే దొరవైతివా
చేరి యంటుకొంటేనే చేఁతలాడి వైతివా
దారకాన దక్కఁ గొనఁదగుఁ గాక పతిని
(॥॥)
పెనఁగి దండఁ గూచుంటే పెండ్లికూఁతుర వైతివా
పనులు సేసితే నేరువరివైతివా
యెనసి శ్రీవేంకటేశుఁ డేలె నన్నిందుకు, నీవు
చెనకి మెచ్చేది మంచిదిగాక ఇతనిని
(||pallavi||)
ūrage viṭravīm̐gevu vuvidalalonanĕllā
yīrīdi nuṁḍidenu nāyīḍudānavaidivā
(||||)
paṁtamudo bigiside pagaḍudānavaidivā
saṁtasuddulu sĕppide jāṇavaidivā
baṁtim̐ gūsuṁḍidene paṭṭabudevi vaidivā
vaṁtudoḍa valabiṁchavalĕm̐ gāga vibhuni
(||||)
sārĕ sārĕ navvidene sanavarivaidivā
torabum̐ gŏppu vĕṭṭide dŏravaidivā
seri yaṁṭugŏṁṭene sem̐talāḍi vaidivā
dāragāna dakkam̐ gŏnam̐dagum̐ gāga padini
(||||)
pĕnam̐gi daṁḍam̐ gūsuṁṭe pĕṁḍligūm̐tura vaidivā
panulu seside neruvarivaidivā
yĕnasi śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nanniṁdugu, nīvu
sĕnagi mĕchchedi maṁchidigāga idanini