Oorage taanela nannu vottugavachcheene veemdu

ఊరకే తానేల నన్ను వొత్తుకవచ్చీనే వీఁడు
Language

(॥పల్లవి॥)
ఊరకే తానేల నన్ను వొత్తుకవచ్చీనే వీఁడు
పోరచిగాఁ జెలులాల బుద్దిచెప్పఁగదరే

(॥ఊర॥)
తియ్యనిమోవులఁ గావా తెఱవలు వెంగేలాడి
చయ్యాటాలఁ బతులను సాధించేది
పయ్యదలోనున్న యట్టి పాలిండ్లేకావా
గయ్యాళిరతులలోన కడునాటేవి

(॥ఊర॥)
చల్లనిచూపులే కావా సారెసారె భ్రమయించి
వల్లెవేసి వలపుల వలఁబెట్టేవి
పెల్లున మంచినున్ననిపిఱుఁదు లివే కావా
జల్లన గుండెగరఁచి సడిఁబెట్టేవి

(॥ఊర॥)
నయగారి తనములనగవు లివే కావా
ప్రియము వుట్టించి పెడరెఁచేవి
నియతి శ్రీవేంకటాద్రినిలయుఁడు నన్నుఁ గూడె
క్రియతో నారూపేకాదా కెరలించేది

(||pallavi||)
ūrage tānela nannu vŏttugavachchīne vīm̐ḍu
porasigām̐ jĕlulāla buddisĕppam̐gadare

(||ūra||)
tiyyanimovulam̐ gāvā tĕṟavalu vĕṁgelāḍi
sayyāḍālam̐ badulanu sādhiṁchedi
payyadalonunna yaṭṭi pāliṁḍlegāvā
gayyāḽiradulalona kaḍunāḍevi

(||ūra||)
sallanisūbule kāvā sārĕsārĕ bhramayiṁchi
vallĕvesi valabula valam̐bĕṭṭevi
pĕlluna maṁchinunnanibiṟum̐du live kāvā
jallana guṁḍĕgaram̐si saḍim̐bĕṭṭevi

(||ūra||)
nayagāri tanamulanagavu live kāvā
priyamu vuṭṭiṁchi pĕḍarĕm̐sevi
niyadi śhrīveṁkaḍādrinilayum̐ḍu nannum̐ gūḍĕ
kriyado nārūbegādā kĕraliṁchedi