Oorage samdamu sesugumdaanam gaaga

ఊరకే చందము సేసుకుందానఁ గాక
Language

(॥పల్లవి॥)
ఊరకే చందము సేసుకుందానఁ గాక
నేరుపుల నీ గుణాలు నే నెఱఁగనా

(॥ఊర॥)
యెగ్గులేని యాకెనీలో యడమాఁటలు
సిగ్గరితనాలలోని చే సన్నలు
వొగ్గి యియ్యకొన్నట్టి వొడఁబాటులు
నిగ్గుదేరె మీ సుద్దులు నే నెఱంగనా

(॥ఊర॥)
తక్కక మీ రెంచుకొన్న తలపోఁతలు
చెక్కిటి చేతులు తోడిచిరునవ్వులు
దక్కి మీకు సరివచ్చె తారుకాణలు
నిక్కమైన నేస్తాలు నే నెఱంగనా

(॥ఊర॥)
తలకొన్న రతులలో తరితీపులు
కొలఁది మీరిన మతి కోరికలు
చెలరేఁగి న న్నేలిన శ్రీవేంకటేశ
నిలిచిన మీ చేఁతలు నే నెఱంగనా

(||pallavi||)
ūrage saṁdamu sesuguṁdānam̐ gāga
nerubula nī guṇālu ne nĕṟam̐ganā

(||ūra||)
yĕgguleni yāgĕnīlo yaḍamām̐ṭalu
siggaridanālaloni se sannalu
vŏggi yiyyagŏnnaṭṭi vŏḍam̐bāḍulu
nigguderĕ mī suddulu ne nĕṟaṁganā

(||ūra||)
takkaga mī rĕṁchugŏnna talabom̐talu
sĕkkiḍi sedulu toḍisirunavvulu
dakki mīgu sarivachchĕ tārugāṇalu
nikkamaina nestālu ne nĕṟaṁganā

(||ūra||)
talagŏnna radulalo taridībulu
kŏlam̐di mīrina madi korigalu
sĕlarem̐gi na nnelina śhrīveṁkaḍeśha
nilisina mī sem̐talu ne nĕṟaṁganā