ఊరకె చక్కజాడతో నుండనీరాదా
(॥పల్లవి॥)
ఊరకె చక్కజాడతో నుండనీరాదా
సారె సారె మమ్మునింత జాగుసేయవలెనా
(॥ఊర॥)
కన్నసతులనెల్లా నాకాళ్లకు మొక్కించేవు
పన్ని నీవే మొక్కించుక బతుకరాదా
ఇన్నేసిరవ్వలు సేసి యేల వుప్పటించేవు
కన్నెలము మమ్మునింత కాకుసేయవలెనా
(॥ఊర॥)
అండనున్న వారిచేత నాకుమడి చిప్పించేవు
దండిగా నీవే అందుక తనియరాదా
బండునేసి మమ్మునేల పరచేవు ఇటువలె
నిండుసిగ్గులవారము నేఁడె ఇంతవలెనా
(॥ఊర॥)
వుమ్మడిసవతులచే నూడిగాలు సేఇంచేవు
ఇమ్ముల నీవే మెచ్చి ఇయ్యకోరాదా
నమ్మించి శ్రీవేంకటేశ నన్ను నిట్టె కూడితివి
సమ్మతించి నీవారము సంతోసించవలెనా
(||pallavi||)
ūragĕ sakkajāḍado nuṁḍanīrādā
sārĕ sārĕ mammuniṁta jāguseyavalĕnā
(||ūra||)
kannasadulanĕllā nāgāḽlagu mŏkkiṁchevu
panni nīve mŏkkiṁchuga badugarādā
innesiravvalu sesi yela vuppaḍiṁchevu
kannĕlamu mammuniṁta kāguseyavalĕnā
(||ūra||)
aṁḍanunna vāriseda nāgumaḍi sippiṁchevu
daṁḍigā nīve aṁduga taniyarādā
baṁḍunesi mammunela parasevu iḍuvalĕ
niṁḍusiggulavāramu nem̐ḍĕ iṁtavalĕnā
(||ūra||)
vummaḍisavadulase nūḍigālu seiṁchevu
immula nīve mĕchchi iyyagorādā
nammiṁchi śhrīveṁkaḍeśha nannu niṭṭĕ kūḍidivi
sammadiṁchi nīvāramu saṁtosiṁchavalĕnā