ఊరకే పాట్లఁ బడి వొడలే నిత్య మనుచు
(॥పల్లవి॥)
ఊరకే పాట్లఁ బడి వొడలే నిత్య మనుచు
ఆరిడి వృథా తిరిగీనయ్యో ప్రాణి
(॥ఊరకే॥)
నరుఁడు నూరేండ్లవాఁడై నాఁడు చొచ్చె లోకము
నరకమో స్వర్గమో నవిఁ గానఁడు
పొరిఁదనుఁ బొదిగిన పుత్రమిత్రకళత్రాదులు
అరసి యెన్నటివారో అదియూ నెంచఁడు
(॥ఊరకే॥)
పనితో యిడుమ పాటువడి గడించిన సొమ్ము
తనకో వొరులకో తా నెఱుఁగఁడు
అనుభవించవలసె అన్నిట కర్మఫలాలు
వెనకో ముందరో యిది విచారించఁడు
(॥ఊరకే॥)
నుదుట వ్రాసిన వ్రాలు నోరిఁ జేతఁ జుట్టుకొని
తుదకో మొదలికో తొంగి చూడఁడు
యిదివో శ్రీ వేంకటేశుఁ డెదుటనే వున్నాఁడు
కదిసి శరణంటేఁ గాచీనతఁడు
(||pallavi||)
ūrage pāṭlam̐ baḍi vŏḍale nitya manusu
āriḍi vṛthā tirigīnayyo prāṇi
(||ūrage||)
narum̐ḍu nūreṁḍlavām̐ḍai nām̐ḍu sŏchchĕ logamu
naragamo svargamo navim̐ gānam̐ḍu
pŏrim̐danum̐ bŏdigina putramitragaḽatrādulu
arasi yĕnnaḍivāro adiyū nĕṁcham̐ḍu
(||ūrage||)
panido yiḍuma pāḍuvaḍi gaḍiṁchina sŏmmu
tanago vŏrulago tā nĕṟum̐gam̐ḍu
anubhaviṁchavalasĕ anniḍa karmaphalālu
vĕnago muṁdaro yidi visāriṁcham̐ḍu
(||ūrage||)
nuduḍa vrāsina vrālu norim̐ jedam̐ juṭṭugŏni
tudago mŏdaligo tŏṁgi sūḍam̐ḍu
yidivo śhrī veṁkaḍeśhum̐ ḍĕduḍane vunnām̐ḍu
kadisi śharaṇaṁṭem̐ gāsīnadam̐ḍu