ఊరకే నోరు మూసుక వుండలేము చూచిచూచి
(॥పల్లవి॥)
ఊరకే నోరు మూసుక వుండలేము చూచిచూచి
చేరి నేము చెప్పినట్లు సేయవయ్య నీవు
(॥ఊర॥)
పాయకురమణి గాన పంతానకే పెనఁగీని
చేయివట్టి తీసినా చేరఁగరాదు
ఆయము సోఁకినమాట ఆడితే నేకేమాయ
వోయయ్య నీ కోపమున కోపమయ్య నేము
(॥ఊర॥)
సిగ్గువడేసతిగాన శిర సట్టె వంచీని
వొగ్గి పేరఁ బిలిచిన నూరకున్నది
దగ్గరి నీవు పైకొంటే తగవు నీకేమీ దప్పు
వెగ్గళించేరాజసము వెఱతుమయ్యా
(॥ఊర॥)
కాఁగినరమణిగాన కడు బడలియున్నది
ఆఁగి నేమేమిచెప్పినా నడ్డమాడదు
దాఁగక శ్రీ వేంకటేశ తరుణిఁ గూడితి నీవే
యేఁగుఁబెండ్లి ఆయ నేఁడు యిమ్మకొంటివయ్యా
(||pallavi||)
ūrage noru mūsuga vuṁḍalemu sūsisūsi
seri nemu sĕppinaṭlu seyavayya nīvu
(||ūra||)
pāyaguramaṇi gāna paṁtānage pĕnam̐gīni
seyivaṭṭi tīsinā seram̐garādu
āyamu som̐kinamāḍa āḍide negemāya
voyayya nī kobamuna kobamayya nemu
(||ūra||)
sigguvaḍesadigāna śhira saṭṭĕ vaṁchīni
vŏggi peram̐ bilisina nūragunnadi
daggari nīvu paigŏṁṭe tagavu nīgemī dappu
vĕggaḽiṁcherājasamu vĕṟadumayyā
(||ūra||)
kām̐ginaramaṇigāna kaḍu baḍaliyunnadi
ām̐gi nememisĕppinā naḍḍamāḍadu
dām̐gaga śhrī veṁkaḍeśha taruṇim̐ gūḍidi nīve
yem̐gum̐bĕṁḍli āya nem̐ḍu yimmagŏṁṭivayyā