Oorage ni nnimta sesi vuppadimchenaa

ఊరకె ని న్నింత సేసి వుప్పటించేనా
Language

(॥పల్లవి॥)
ఊరకె ని న్నింత సేసి వుప్పటించేనా
తేరె నన్నిపనులు నిందె మొక్కే రావయ్యా

(॥ఊరకె॥)
కప్పురవిడెము నీవు కాంతచేత నుందుకోఁగా
దెప్పరపుకోపమునఁ దిట్టితిఁ గాక
నెప్పున నాపెసొమ్ములు నీమేన నుండఁ గాను
అప్పుడె నాతో నేను అలిగితిఁ గాకా

(॥ఊరకె॥)
ముసిముసి నవ్వులతో ముదితమోము చూడఁగా
వెసఁ బూవుబంతిఁ గొని వేసితిఁ గాకా
వసమై యాపె నీతో వట్టిసన్నలు సేయఁగ
యిసు మంత నిన్ను నేర మెంచితిఁ గాకా

(॥ఊరకె॥)
గట్టిగా నీ వాసతి కాఁగిట నుండఁగాఁ జూచి
చిట్టకానకుఁ బాదానఁ జిమ్మితిఁ గాకా
నెట్టన శ్రీవెంకటేశ నీవే నన్నుఁ గూడితివి
గుట్టున నన్నిటా నిన్నే కొసరితిఁ గాకా

(||pallavi||)
ūragĕ ni nniṁta sesi vuppaḍiṁchenā
terĕ nannibanulu niṁdĕ mŏkke rāvayyā

(||ūragĕ||)
kappuraviḍĕmu nīvu kāṁtaseda nuṁdugom̐gā
dĕpparabugobamunam̐ diṭṭidim̐ gāga
nĕppuna nābĕsŏmmulu nīmena nuṁḍam̐ gānu
appuḍĕ nādo nenu aligidim̐ gāgā

(||ūragĕ||)
musimusi navvulado mudidamomu sūḍam̐gā
vĕsam̐ būvubaṁtim̐ gŏni vesidim̐ gāgā
vasamai yābĕ nīdo vaṭṭisannalu seyam̐ga
yisu maṁta ninnu nera mĕṁchidim̐ gāgā

(||ūragĕ||)
gaṭṭigā nī vāsadi kām̐giḍa nuṁḍam̐gām̐ jūsi
siṭṭagānagum̐ bādānam̐ jimmidim̐ gāgā
nĕṭṭana śhrīvĕṁkaḍeśha nīve nannum̐ gūḍidivi
guṭṭuna nanniḍā ninne kŏsaridim̐ gāgā