ఊరకే నీవు లోగివున్నాడ వింతెకాక
(॥పల్లవి॥)
ఊరకే నీవు లోగివున్నాడ వింతెకాక
చేరి నీవేమి సేసినా చెల్లదా నీకు
(॥॥)
పడఁతి పొడగంటేను బాగా లిచ్చితివి గాని
తొడపై నిడుకొంటేను దోసమా నీకు
చిడుముడి నిలిచితే చేయివట్టితివి గాని
వొడివట్టి తీసితేను వొద్దనేరా నిన్నును
(॥॥)
కొలువుసేసెనంటా కొప్పుదువ్వితివి గాని
ఇలఁగాగిలించుకొంటే హీనమా నీకు
అలరి మాటాడితేను ఆసచూపితివిగాని
కలసి పెండ్లాడితేను కాదనేరా నిన్నును
(॥॥)
చెంతఁ బాయకున్న దంటా చెక్కునొక్కితివిగాని
యెంత వంచనసేసినా నెగ్గా నీకు
ఇంతలో నన్నేలి యాకె నేలేవు శ్రీ వేంకటేశ
బంతి నెంతమన్నించినా పంగించేరా నిన్నును
(||pallavi||)
ūrage nīvu logivunnāḍa viṁtĕgāga
seri nīvemi sesinā sĕlladā nīgu
(||||)
paḍam̐ti pŏḍagaṁṭenu bāgā lichchidivi gāni
tŏḍabai niḍugŏṁṭenu dosamā nīgu
siḍumuḍi niliside seyivaṭṭidivi gāni
vŏḍivaṭṭi tīsidenu vŏddanerā ninnunu
(||||)
kŏluvusesĕnaṁṭā kŏppuduvvidivi gāni
ilam̐gāgiliṁchugŏṁṭe hīnamā nīgu
alari māḍāḍidenu āsasūbidivigāni
kalasi pĕṁḍlāḍidenu kādanerā ninnunu
(||||)
sĕṁtam̐ bāyagunna daṁṭā sĕkkunŏkkidivigāni
yĕṁta vaṁchanasesinā nĕggā nīgu
iṁtalo nanneli yāgĕ nelevu śhrī veṁkaḍeśha
baṁti nĕṁtamanniṁchinā paṁgiṁcherā ninnunu