ఊరకే నీ వలలఁ జిక్కున్న దానను
(॥పల్లవి॥)
ఊరకే నీ వలలఁ జిక్కున్న దానను
తేరకొన నాపాలికి దిక్కునీవే సుమ్మీ
(॥ఊర॥)
నీవు విచ్చేసినదాఁకా నేఁ జింతించితిఁ గాని
పూవువలెఁ బట్టి నిన్ను భోగించనేర
వేవేలుఁ జెలులచేత విన్నవింపించితిఁ గాని
కావిరి నిన్ను సాదించి రట్టుకొనే దేదో
(॥ఊర॥)
నిమాట విన్నదాఁకా నే వేగిరించితిఁ గాని
దోమటి చె చాఁచి నిన్నుఁ దొడుక లేదు
వోముచుఁ బైకొని నీ వొద్దికి వచ్చితిఁ గాని
ఆ మీఁదట్టిను లడిగే దేదో
(॥ఊర॥)
గక్కన నిన్నుఁగూడి కన్నుల నవ్వితిఁ గాని
తక్కక నీ యాస లేమి దప్పించనైతి
వొక్కటైతి మిద్దరము వొరసి శ్రీవేంకటేశ
మిక్కిటి నిన్ను మెప్పించి మెరసే దేదో
(||pallavi||)
ūrage nī valalam̐ jikkunna dānanu
teragŏna nābāligi dikkunīve summī
(||ūra||)
nīvu vichchesinadām̐kā nem̐ jiṁtiṁchidim̐ gāni
pūvuvalĕm̐ baṭṭi ninnu bhogiṁchanera
vevelum̐ jĕlulaseda vinnaviṁpiṁchidim̐ gāni
kāviri ninnu sādiṁchi raṭṭugŏne dedo
(||ūra||)
nimāḍa vinnadām̐kā ne vegiriṁchidim̐ gāni
domaḍi sĕ sām̐si ninnum̐ dŏḍuga ledu
vomusum̐ baigŏni nī vŏddigi vachchidim̐ gāni
ā mīm̐daṭṭinu laḍige dedo
(||ūra||)
gakkana ninnum̐gūḍi kannula navvidim̐ gāni
takkaga nī yāsa lemi dappiṁchanaidi
vŏkkaḍaidi middaramu vŏrasi śhrīveṁkaḍeśha
mikkiḍi ninnu mĕppiṁchi mĕrase dedo