ఊరకే నే గుట్టు సేసుకున్నదానఁ గాక నేఁడు
(॥పల్లవి॥)
ఊరకే నే గుట్టు సేసుకున్నదానఁ గాక నేఁడు
తేరి తప్పక చూచితే దిష్టము గాదా
(॥ఊర॥)
మొగము చూచితే నీవు మొక్కేవు । నాకు
నగవు వచ్చీ నీ నయములకు
వొగరుతో నీవు వుండేవునికికిని । నిన్ను
తగవులఁ బెట్టితేను తప్పు మోవదా
(॥ఊర॥)
చేయివట్టి తీసితేనే సిగ్గువడేవు । నా
కాయము చెమరించీ నీకతలకును
ఆయముగా నీవు వెట్టే యానలకును । యిట్టె
చాయల దీకొంటేను చలమే కదా
(॥ఊర॥)
కోరి నిన్నుఁ బిలిచితే కొసరేవు నాకు
తారుకాణ లాయను నీతలఁ పెల్లాను
కూరిమి శ్రీ వేంకటేశ కూడితివి నన్ను
నేరుపుల మెచ్చితేను నీవే నేఁ గానా
(||pallavi||)
ūrage ne guṭṭu sesugunnadānam̐ gāga nem̐ḍu
teri tappaga sūside diṣhṭamu gādā
(||ūra||)
mŏgamu sūside nīvu mŏkkevu | nāgu
nagavu vachchī nī nayamulagu
vŏgarudo nīvu vuṁḍevunigikini | ninnu
tagavulam̐ bĕṭṭidenu tappu movadā
(||ūra||)
seyivaṭṭi tīsidene sigguvaḍevu | nā
kāyamu sĕmariṁchī nīgadalagunu
āyamugā nīvu vĕṭṭe yānalagunu | yiṭṭĕ
sāyala dīgŏṁṭenu salame kadā
(||ūra||)
kori ninnum̐ biliside kŏsarevu nāgu
tārugāṇa lāyanu nīdalam̐ pĕllānu
kūrimi śhrī veṁkaḍeśha kūḍidivi nannu
nerubula mĕchchidenu nīve nem̐ gānā