ఊరకే నన్ను మెచ్చీని వొద్దికైనదాననంటా
(॥పల్లవి॥)
ఊరకే నన్ను మెచ్చీని వొద్దికైనదాననంటా
యీ రీతి నన్నుఁ బొగడె నేపనికి వత్తునే
(॥ఊర॥)
చనవుగలుగువారు సంగడి నుండఁగఁదగు
మనసునమ్మినవారు మాటాడఁదగు
పనిగలిగినవారు పట్టిపెనఁగఁగఁదగు
యెనసి నన్ను మన్నించె నెందులోనిదాననే
(॥ఊర॥)
తగవెరిఁగినవారు తరితీపు సేయఁదగు
మొగమిచ్చలాడేవారు మొక్కఁగఁదగు
నగనేరిచినవారు నయము చూపఁగఁదగు
యిగురుమోవి ఇచ్చె నేమనఁగఁగలనే
(॥ఊర॥)
మేనరికమైనవారు మేకులు సేయఁగఁదగు
పూని పాయరానివారు భోగించఁదగు
యే నలమేలుమంగను యీతఁడు శ్రీవేంకటేశుఁ-
డీనెపాన నన్నుఁ గూడె నేమని చెప్పుదునే
(||pallavi||)
ūrage nannu mĕchchīni vŏddigainadānanaṁṭā
yī rīdi nannum̐ bŏgaḍĕ nebanigi vattune
(||ūra||)
sanavugaluguvāru saṁgaḍi nuṁḍam̐gam̐dagu
manasunamminavāru māḍāḍam̐dagu
panigaliginavāru paṭṭibĕnam̐gam̐gam̐dagu
yĕnasi nannu manniṁchĕ nĕṁdulonidānane
(||ūra||)
tagavĕrim̐ginavāru taridību seyam̐dagu
mŏgamichchalāḍevāru mŏkkam̐gam̐dagu
naganerisinavāru nayamu sūbam̐gam̐dagu
yigurumovi ichchĕ nemanam̐gam̐galane
(||ūra||)
menarigamainavāru megulu seyam̐gam̐dagu
pūni pāyarānivāru bhogiṁcham̐dagu
ye nalamelumaṁganu yīdam̐ḍu śhrīveṁkaḍeśhum̐-
ḍīnĕbāna nannum̐ gūḍĕ nemani sĕppudune