Oorage meerelamma voddanaadani saadimcha

ఊరకే మీరేలమ్మ వొద్దనాతని సాదించ
Language

(॥పల్లవి॥)
ఊరకే మీరేలమ్మ వొద్దనాతని సాదించ
ఆరయ ముందెరఁగ(గనా?) నేనందరి శాంతములు

(॥ఊరకే॥)
అమ్మరో మిమ్మింతమాట ఆడకుండఁగానే కాక
వుమ్మడి మీరోరిచేరా ఓసోసి నేఁడు
యెమ్మెల నాకుఁ గాఁగానే యింతేసి బుద్ధి చెప్పేరు
మిమ్ము సోఁకి వచ్చితేఁగా మీరాతనినందురు

(॥ఊరకే॥)
చెనకి మిమ్మింత చేఁత సేయకుండఁగానే కాక
పనివడి యాతని వెంబడేరా మీరు
తనిసి నాకుఁ గాఁగానే తగవులు నెరపేరు
కనలి మీవరుసైతేఁగా పతినందురు

(॥ఊరకే॥)
బలిమి మిమ్మింత యెడవాయకుండాఁగానే కాక
వలపు చల్లకుండేరా వానిపై మీరు
అలమేలుమంగ నేను ఆతఁడు శ్రీవేంకటేశుఁ-
డలరి కూడితిమి మిమ్మంటేఁగానందురు

(||pallavi||)
ūrage mīrelamma vŏddanādani sādiṁcha
āraya muṁdĕram̐ga(ganā?) nenaṁdari śhāṁtamulu

(||ūrage||)
ammaro mimmiṁtamāḍa āḍaguṁḍam̐gāne kāga
vummaḍi mīroriserā ososi nem̐ḍu
yĕmmĕla nāgum̐ gām̐gāne yiṁtesi buddhi sĕpperu
mimmu som̐ki vachchidem̐gā mīrādaninaṁduru

(||ūrage||)
sĕnagi mimmiṁta sem̐ta seyaguṁḍam̐gāne kāga
panivaḍi yādani vĕṁbaḍerā mīru
tanisi nāgum̐ gām̐gāne tagavulu nĕraberu
kanali mīvarusaidem̐gā padinaṁduru

(||ūrage||)
balimi mimmiṁta yĕḍavāyaguṁḍām̐gāne kāga
valabu sallaguṁḍerā vānibai mīru
alamelumaṁga nenu ādam̐ḍu śhrīveṁkaḍeśhum̐-
ḍalari kūḍidimi mimmaṁṭem̐gānaṁduru