Oorage maruni paumju looramgoodaalu

ఊరకే మరుని పౌఁజు లూరఁగూటాలు
Language

(॥పల్లవి॥)
ఊరకే మరుని పౌఁజు లూరఁగూటాలు
ఆరసితే వట్టిజూబు లివి నీకు నెదురా

(॥ఊర॥)
కొలనిలో తుమ్మిదలు కొమ్మలపై కోవిలలు
బలము లింతేపో భావజునికి
నెలఁత నియ్యందైతే నెరిఁగలతుమ్మిదలుఁ
బలుకుఁగోవిలలునుఁ బంతమాడీఁగదవే

(॥ఊర॥)
తీగలపై విరులును తియ్యనితుంటచెఱకు
చేగలయమ్ములు విల్లుఁ జిత్తజునకు
సోగలబొమ్మలవిల్లుఁ జూపులయమ్ములు నీకు
యీగతుల నింతి నీకు వెడయవుగదవే

(॥ఊర॥)
యెక్కడో చందురుఁడును యెడవుల చల్లగాలి
మక్కువైన తోడు దొన మదనునికి
గక్కన శ్రీవేంకటేశు కాఁగిటినీకై తేను
వొక్కచో వదనచంద్రుఁ డూరుపే గాలిగదే

(||pallavi||)
ūrage maruni paum̐ju lūram̐gūḍālu
āraside vaṭṭijūbu livi nīgu nĕdurā

(||ūra||)
kŏlanilo tummidalu kŏmmalabai kovilalu
balamu liṁtebo bhāvajunigi
nĕlam̐ta niyyaṁdaide nĕrim̐galadummidalum̐
balugum̐govilalunum̐ baṁtamāḍīm̐gadave

(||ūra||)
tīgalabai virulunu tiyyaniduṁṭasĕṟagu
segalayammulu villum̐ jittajunagu
sogalabŏmmalavillum̐ jūbulayammulu nīgu
yīgadula niṁti nīgu vĕḍayavugadave

(||ūra||)
yĕkkaḍo saṁdurum̐ḍunu yĕḍavula sallagāli
makkuvaina toḍu dŏna madanunigi
gakkana śhrīveṁkaḍeśhu kām̐giḍinīgai tenu
vŏkkaso vadanasaṁdrum̐ ḍūrube gāligade