ఊరకే మమ్మేల యింత వొరసీఁ దాను
(॥పల్లవి॥)
ఊరకే మమ్మేల యింత వొరసీఁ దాను
కారణము గలిగితే కైకొనీఁ గాక
(॥ఊర॥)
సొలయ నే వచ్చితేను చూచుఁగాక నాదిక్కు
యెలమి నే మొక్కితే తలెత్తుఁగాక
కెలసి నేఁ గదిమితే గిరుపుఁగాక మూఁతులు
నలి నేఁ దొక్కితేనే నవ్వుఁగాక
(॥ఊర॥)
పొసఁగకున్న నెఁదైనా పొడవులు చూచుఁగాక
కొరినవారితోనే గునియుఁగాక
వెస నేను లోన నుంటే వెదకి తా వచ్చుఁగాక
వసమైతే బలువుఁడై వచ్చి పెండ్లాడుఁగాక
(॥ఊర॥)
చిత్తజకేలివేళ నే సిగ్గులు విడుచుఁగాక
వొత్తితే రాయివలె నుండుఁగాక
యిత్తల శ్రీవేంకటేశుఁడింతలో నన్నుఁ గూడె
పొత్తులఁ దా నాతో నిఁక పొదలుఁగాక
(||pallavi||)
ūrage mammela yiṁta vŏrasīm̐ dānu
kāraṇamu galigide kaigŏnīm̐ gāga
(||ūra||)
sŏlaya ne vachchidenu sūsum̐gāga nādikku
yĕlami ne mŏkkide talĕttum̐gāga
kĕlasi nem̐ gadimide girubum̐gāga mūm̐tulu
nali nem̐ dŏkkidene navvum̐gāga
(||ūra||)
pŏsam̐gagunna nĕm̐dainā pŏḍavulu sūsum̐gāga
kŏrinavāridone guniyum̐gāga
vĕsa nenu lona nuṁṭe vĕdagi tā vachchum̐gāga
vasamaide baluvum̐ḍai vachchi pĕṁḍlāḍum̐gāga
(||ūra||)
sittajageliveḽa ne siggulu viḍusum̐gāga
vŏttide rāyivalĕ nuṁḍum̐gāga
yittala śhrīveṁkaḍeśhum̐ḍiṁtalo nannum̐ gūḍĕ
pŏttulam̐ dā nādo nim̐ka pŏdalum̐gāga