ఊరకే లోనౌదువా వుడిబడి వారికెల్ల
(॥పల్లవి॥)
ఊరకే లోనౌదువా వుడిబడి వారికెల్ల
మేరమీరి యాపెనే మెచ్చవలెనయ్యా
(॥ఊర॥)
మెల్లనిమాటలాడి మెలుఁత నిన్ను భ్రమించె
చల్లనినవ్వులు నవ్వి సాదించెను
మొల్లలతురుము చూపి సుదతి నిన్నుఁ జొక్కించె
చెల్లునయ్యాఆపె మేమిసేసినాను నిన్నును
(॥ఊర॥)
సోయగపుచూపు చూచి సుదతి నిన్నుఁ జొక్కించె
ఆయాలు చన్నులనొత్తి అసరేఁచెను
పాయపుమదము చిమ్మి భావమెల్లాఁ గరఁగించె
నోయంతవాని నాపె నేర్చునయ్యా పొందను
(॥ఊర॥)
వేవేలు చేఁతలు చేసి వెలఁది నిన్ను మొప్పించె
చేవదేరే రతులను చిక్కించెను
యీవేళ శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
ఆవేళ కాపె రాజు అవునయ్య నీకును
(||pallavi||)
ūrage lonauduvā vuḍibaḍi vārigĕlla
meramīri yābĕne mĕchchavalĕnayyā
(||ūra||)
mĕllanimāḍalāḍi mĕlum̐ta ninnu bhramiṁchĕ
sallaninavvulu navvi sādiṁchĕnu
mŏllaladurumu sūbi sudadi ninnum̐ jŏkkiṁchĕ
sĕllunayyāābĕ memisesinānu ninnunu
(||ūra||)
soyagabusūbu sūsi sudadi ninnum̐ jŏkkiṁchĕ
āyālu sannulanŏtti asarem̐sĕnu
pāyabumadamu simmi bhāvamĕllām̐ garam̐giṁchĕ
noyaṁtavāni nābĕ nersunayyā pŏṁdanu
(||ūra||)
vevelu sem̐talu sesi vĕlam̐di ninnu mŏppiṁchĕ
sevadere radulanu sikkiṁchĕnu
yīveḽa śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
āveḽa kābĕ rāju avunayya nīgunu