Oorage kobagimchagu voho neevu

ఊరకే కోపగించకు వోహో నీవు
Language

(॥పల్లవి॥)
ఊరకే కోపగించకు వోహో నీవు
కారణములేని వాదు కాంతకు లేదు

(॥ఊర॥)
నెపములేక నిన్ను నెలఁత మాటాడీనా
వుపమించుకొనలేక వుసురనేవు
నిపుణతఁ దలఁచుకొని నీవు మఱచితివేమో
కపటము లే దాపె కల్లలాడదు

(॥ఊర॥)
నీవుసేయనిపనులు నింద నీపై మోపీనా
భావించలేక యెగ్గులుపట్టనేఁటికి
చెవదేరఁ బరాకుసేసితివేమో నీవు
వేవేలకు నాపె కవివేకము లేదు

(॥ఊర॥)
చవులు నీవు చూపక చనవులు మెరసీనా
యివల సెలవినవ్వు యేల దాఁచేవు
రవళి శ్రీవేంకటేశ రతి సిగ్గువడేవేమో
కవగూడ నాపె నిన్నేగతిఁ బాయదు

(||pallavi||)
ūrage kobagiṁchagu voho nīvu
kāraṇamuleni vādu kāṁtagu ledu

(||ūra||)
nĕbamulega ninnu nĕlam̐ta māḍāḍīnā
vubamiṁchugŏnalega vusuranevu
nibuṇadam̐ dalam̐sugŏni nīvu maṟasidivemo
kabaḍamu le dābĕ kallalāḍadu

(||ūra||)
nīvuseyanibanulu niṁda nībai mobīnā
bhāviṁchalega yĕggulubaṭṭanem̐ṭigi
sĕvaderam̐ barāgusesidivemo nīvu
vevelagu nābĕ kavivegamu ledu

(||ūra||)
savulu nīvu sūbaga sanavulu mĕrasīnā
yivala sĕlavinavvu yela dām̐sevu
ravaḽi śhrīveṁkaḍeśha radi sigguvaḍevemo
kavagūḍa nābĕ ninnegadim̐ bāyadu