ఊరకె జంకించెనంటా నుప్పతించేవు
(॥పల్లవి॥)
ఊరకె జంకించెనంటా నుప్పతించేవు
గారవపుదాని కెంత గడిఇంచేవయ్యా
(॥ఊర॥)
చెప్పిన నీ మాఁటలెల్లాఁ జెవు లాలకించి వినె
కొప్పు వట్టి తీసితే మక్కువ జేకొని
కప్పుర విడె మిచ్చితే గక్కనఁ దా నందుకొనె
యిప్పు డింతకెంటెఁ జెలి యేమి సేసునయ్యా
(॥ఊర॥)
పేరుకొని పిలిచిరతే ప్రియముతో నూఁకొనె
సారె నీవు నవ్వితేను సమ్మతించెను
చేరి నీవు చెనకితే చెతులెత్తి నీకు మొక్కె
యీరీతి దా నింతకంటె నేమ సేసునయ్యా
(॥ఊర॥)
చెక్కు నీవు నొక్కితేను చెంగలించి వొడఁబడె
గక్కనఁ గాఁగిలించితే కరఁగె మతి
చక్కని శ్రీవేంకటేశ సతినిట్టె యేలితివి
యెక్కువాయ నింతకంటె నేమి సేతునయ్యా
(||pallavi||)
ūragĕ jaṁkiṁchĕnaṁṭā nuppadiṁchevu
gāravabudāni kĕṁta gaḍiiṁchevayyā
(||ūra||)
sĕppina nī mām̐ṭalĕllām̐ jĕvu lālagiṁchi vinĕ
kŏppu vaṭṭi tīside makkuva jegŏni
kappura viḍĕ michchide gakkanam̐ dā naṁdugŏnĕ
yippu ḍiṁtagĕṁṭĕm̐ jĕli yemi sesunayyā
(||ūra||)
perugŏni pilisirade priyamudo nūm̐kŏnĕ
sārĕ nīvu navvidenu sammadiṁchĕnu
seri nīvu sĕnagide sĕdulĕtti nīgu mŏkkĕ
yīrīdi dā niṁtagaṁṭĕ nema sesunayyā
(||ūra||)
sĕkku nīvu nŏkkidenu sĕṁgaliṁchi vŏḍam̐baḍĕ
gakkanam̐ gām̐giliṁchide karam̐gĕ madi
sakkani śhrīveṁkaḍeśha sadiniṭṭĕ yelidivi
yĕkkuvāya niṁtagaṁṭĕ nemi sedunayyā