Oorage guttuna nimka numdavayya

ఊరకె గుట్టున నిఁక నుండవయ్య
Language

(॥పల్లవి॥)
ఊరకె గుట్టున నిఁక నుండవయ్య
యే రీతికైనా వచ్చు యీ చేఁతలయ్యా

(॥ఊరకె॥)
కన్నుల నీవు నవ్వితె గక్కనఁ గోపము వచ్చీ
వున్నతిఁ జలము రేచ కుండవయ్య
వన్నెలు వాసులతోడ వడి బతికేవారము
నిన్నువలెనా నేము నిలవయ్యా

(॥ఊరకె॥)
కొంగు వట్టే విట్టె నీవు కొలఁది వీరేను నేను
వుంగిటాయ సరసము లుండవయ్య
కుంగనబీరములు యేగ్గులపుట్టలము నేము
యెంగిలి కోరుతువు నిన్నే మనేమయ్యా

(॥ఉరకె॥)
బలిమి సేసేవు నీవు పంతము లెక్కీ నాకు
వొలిసిన వెల్ల నాయ వుండవయ్య
కలతి విట్టె నన్ను కాఁగిట శ్రీవెంకటేశ
చెలిమి మనకు నేఁడు చెల్లునయ్యా

(||pallavi||)
ūragĕ guṭṭuna nim̐ka nuṁḍavayya
ye rīdigainā vachchu yī sem̐talayyā

(||ūragĕ||)
kannula nīvu navvidĕ gakkanam̐ gobamu vachchī
vunnadim̐ jalamu resa kuṁḍavayya
vannĕlu vāsuladoḍa vaḍi badigevāramu
ninnuvalĕnā nemu nilavayyā

(||ūragĕ||)
kŏṁgu vaṭṭe viṭṭĕ nīvu kŏlam̐di vīrenu nenu
vuṁgiḍāya sarasamu luṁḍavayya
kuṁganabīramulu yeggulabuṭṭalamu nemu
yĕṁgili koruduvu ninne manemayyā

(||uragĕ||)
balimi sesevu nīvu paṁtamu lĕkkī nāgu
vŏlisina vĕlla nāya vuṁḍavayya
kaladi viṭṭĕ nannu kām̐giḍa śhrīvĕṁkaḍeśha
sĕlimi managu nem̐ḍu sĕllunayyā