Oorage guttudoduda numdudagaaga

ఊరకే గుట్టుతోడుత నుండుటగాక
Language

(॥పల్లవి॥)
ఊరకే గుట్టుతోడుత నుండుటగాక
కూరిములు పచరించి కొసరఁగవచ్చునా

(॥ఊర॥)
దయదలఁచుక నీవే దండకు వచ్చితిగాక
నయాన నిన్ను రప్పించ నావనమా
నియతపు నీ బాస నెరవేర్చుకొంటిగాక
ప్రియమున నీ గుణము భేదించవచ్చునా

(॥ఊర॥)
లోకము మెచ్చవలసి లోనైతివిగాక
నాకు చేకొని నిన్ను గరఁగించే దాననా
యీకడ నీ కీర్తికి ఇటు నన్నేలితిగాక
దాకొని చిత్తము రా నేస్తము సేయవచ్చునా

(॥ఊర॥)
తగవెంచుకొని నన్ను తతిఁ బెండ్లాడితిగా
తగుఁబొంతనాలు నీకు తలఁపించేనా
నగుతా శ్రీవేంకటాశ నన్ను మన్నించితిగాక
మిగులా నిన్నొరయుచు మెప్పించవచ్చునా

(||pallavi||)
ūrage guṭṭudoḍuda nuṁḍuḍagāga
kūrimulu pasariṁchi kŏsaram̐gavachchunā

(||ūra||)
dayadalam̐suga nīve daṁḍagu vachchidigāga
nayāna ninnu rappiṁcha nāvanamā
niyadabu nī bāsa nĕraversugŏṁṭigāga
priyamuna nī guṇamu bhediṁchavachchunā

(||ūra||)
logamu mĕchchavalasi lonaidivigāga
nāgu segŏni ninnu garam̐giṁche dānanā
yīgaḍa nī kīrdigi iḍu nannelidigāga
dāgŏni sittamu rā nestamu seyavachchunā

(||ūra||)
tagavĕṁchugŏni nannu tadim̐ bĕṁḍlāḍidigā
tagum̐bŏṁtanālu nīgu talam̐piṁchenā
nagudā śhrīveṁkaḍāśha nannu manniṁchidigāga
migulā ninnŏrayusu mĕppiṁchavachchunā