Oorage guttudoda numduvu gaaga

ఊరకే గుట్టుతోడ నుందువు గాక
Language

(॥పల్లవి॥)
ఊరకే గుట్టుతోడ నుందువు గాక
మేరమీరి ఇంత మందెమేళ మేఁటికే

(॥॥)
వేరొకతెమీఁ దఁ బెట్టి విభుఁడు నవ్వినందుకు
సారె సారె నీ వేల జంకించేవే
చేరి నీరతిసుద్దులు చెలులతోఁ జెప్పితేను
గీరుచు గోర నీవెంత గిలిగించేవే

(॥॥)
నెట్టన నెవ్వతెసొమ్మో నీమేనఁ బెట్టినందుకు
ఇట్టె వాఁడిచూపుల నీవేల చూచేవే
జట్టిగొని పెదవులసనన్నలనే తిట్టితేను
గట్టిగాఁ బెదవి యేల గంటినేసేవే

(॥॥)
కాంతలు చూడఁ గ నిన్నుఁగాఁగిలించుకొన్నందుకు
చెంతనుండి నీవేల సిగ్గుపడేవే
ఇంతలో శ్రీవేంకటేశుఁ డేకతాన నిన్నుఁ గూడె
పంతమున నీవెఁత పచ్చి సేసేవే

(||pallavi||)
ūrage guṭṭudoḍa nuṁduvu gāga
meramīri iṁta maṁdĕmeḽa mem̐ṭige

(||||)
verŏgadĕmīm̐ dam̐ bĕṭṭi vibhum̐ḍu navvinaṁdugu
sārĕ sārĕ nī vela jaṁkiṁcheve
seri nīradisuddulu sĕluladom̐ jĕppidenu
gīrusu gora nīvĕṁta giligiṁcheve

(||||)
nĕṭṭana nĕvvadĕsŏmmo nīmenam̐ bĕṭṭinaṁdugu
iṭṭĕ vām̐ḍisūbula nīvela sūseve
jaṭṭigŏni pĕdavulasanannalane tiṭṭidenu
gaṭṭigām̐ bĕdavi yela gaṁṭineseve

(||||)
kāṁtalu sūḍam̐ ga ninnum̐gām̐giliṁchugŏnnaṁdugu
sĕṁtanuṁḍi nīvela siggubaḍeve
iṁtalo śhrīveṁkaḍeśhum̐ ḍegadāna ninnum̐ gūḍĕ
paṁtamuna nīvĕm̐ta pachchi seseve