Oorage guttu sesuga vumduda gaaga

ఊరకె గుట్టు చేసుక వుండుట గాక
Language

(॥పల్లవి॥)
ఊరకె గుట్టు చేసుక వుండుట గాక
వారి వీరివలె దూరవచ్చునా నాకును

(॥ఊర॥)
యెప్పుడుఁ దా నాడా నీడా నేమి సేసి వచ్చినాను
తప్పులెంచవచ్చునా తనతో నాకు
చిప్పిలఁ దనచెక్కుల చెమట లెంత గారినా
చొప్పులెత్తవచ్చునా చూచి చూచి నాకును

(॥ఊర॥)
సిగ్గువడక తా నెంత చిమ్మిరేఁగి వుండినాను
యెగ్గు పట్టవచ్చునా యిదివో నాకు
అగ్గమై తా నందరిలో నటు సరస మాడినా
వెగ్గళించవచ్చునా వింతలుగా నాకును

(॥ఊర॥)
కాంతుఁడు తా నెటువలె కాఁగిఁటఁ బెనఁగినాను
పంతమాడవచ్చునా పక్కన నాకు
ఇంతటా శ్రీ వేంకటేశుఁ డిదె తానె నన్నుఁ గూడె
వంతులు వెట్టవచ్చునా వలపులు నాకును

(||pallavi||)
ūragĕ guṭṭu sesuga vuṁḍuḍa gāga
vāri vīrivalĕ dūravachchunā nāgunu

(||ūra||)
yĕppuḍum̐ dā nāḍā nīḍā nemi sesi vachchinānu
tappulĕṁchavachchunā tanado nāgu
sippilam̐ danasĕkkula sĕmaḍa lĕṁta gārinā
sŏppulĕttavachchunā sūsi sūsi nāgunu

(||ūra||)
sigguvaḍaga tā nĕṁta simmirem̐gi vuṁḍinānu
yĕggu paṭṭavachchunā yidivo nāgu
aggamai tā naṁdarilo naḍu sarasa māḍinā
vĕggaḽiṁchavachchunā viṁtalugā nāgunu

(||ūra||)
kāṁtum̐ḍu tā nĕḍuvalĕ kām̐gim̐ṭam̐ bĕnam̐ginānu
paṁtamāḍavachchunā pakkana nāgu
iṁtaḍā śhrī veṁkaḍeśhum̐ ḍidĕ tānĕ nannum̐ gūḍĕ
vaṁtulu vĕṭṭavachchunā valabulu nāgunu