Oorage gadimchugoni voddu vette naabenu

ఊరకే గడించుకొని వొడ్డు వెట్టే నాపెను
Language

(॥పల్లవి॥)
ఊరకే గడించుకొని వొడ్డు వెట్టే నాపెను
చేరి నీవు గూడఁగాను చెట్ట వట్టి తీసెనా

(॥ఊర॥)
మనసారా నీవే నేఁడు మాయింటికి వచ్చేనంటే
వొనర నొద్దని యాకె వొట్టు పెట్టెనా
చన విచ్చి నీవు నాకు సరవి నడుపే నంటే
ననచకుండా నపుడు నడుమఁ దాఁ దుమ్మెనా

(॥ఊర॥)
పచ్చిగా నీవె నాతో పకపక నవ్వఁగాను
రచ్చల నాపె మరఁగు వచ్చెనా నీకు
విచ్చనవిడై నీవు విడెము చేతి కియ్యఁగా
తచ్చి నిన్నాకె యేమైనాఁ దగవుకుఁ దీసెనా

(॥ఊర॥)
గక్కన నీవుఁ గాఁగిలించుకొనఁగాను
చక్కఁగా నాకె నడుమ సందు చొచ్చెనా
యిక్కడ శ్రీవేకంటేశ యేలితివి నన్ను నిదె
వెక్కసాన నాపె మరి వింత సేసెనా

(||pallavi||)
ūrage gaḍiṁchugŏni vŏḍḍu vĕṭṭe nābĕnu
seri nīvu gūḍam̐gānu sĕṭṭa vaṭṭi tīsĕnā

(||ūra||)
manasārā nīve nem̐ḍu māyiṁṭigi vachchenaṁṭe
vŏnara nŏddani yāgĕ vŏṭṭu pĕṭṭĕnā
sana vichchi nīvu nāgu saravi naḍube naṁṭe
nanasaguṁḍā nabuḍu naḍumam̐ dām̐ dummĕnā

(||ūra||)
pachchigā nīvĕ nādo pagabaga navvam̐gānu
rachchala nābĕ maram̐gu vachchĕnā nīgu
vichchanaviḍai nīvu viḍĕmu sedi kiyyam̐gā
tachchi ninnāgĕ yemainām̐ dagavugum̐ dīsĕnā

(||ūra||)
gakkana nīvum̐ gām̐giliṁchugŏnam̐gānu
sakkam̐gā nāgĕ naḍuma saṁdu sŏchchĕnā
yikkaḍa śhrīvegaṁṭeśha yelidivi nannu nidĕ
vĕkkasāna nābĕ mari viṁta sesĕnā