ఊరకే గడించుకొనీ నోయమ్మా । తన
(॥పల్లవి॥)
ఊరకే గడించుకొనీ నోయమ్మా । తన-
నోరే ఘనము చేసీనో చూడరమ్మా
(॥॥)
తనివార నొకమాఁటు తప్పక చూచితి నింతే
వెనక తనచేఁతకు వెంగెమా యిది
ననుపైన దానఁగాన నవ్వితే నింతే కాక
చెనకేతనతో గేలిచేసితినా
(॥॥)
వుబ్బసపోక నేనే వుస్సురంటి నొకమాఁటు
గొబ్బుననుఁ దనమీఁది కోపమా యిది
నిబ్బరానఁ దనమాఁటే నిజమంటిఁగాక నేను
దబ్బరలు చేసినట్టి తలఁపా యిది
(॥॥)
కడుఁదమకానఁ దన్నుఁ గాఁగిట నించితిఁగాక
సుడిగొన్న తనకాఁక చూచుటా యిది
యొడయక శ్రీవేంకటేశుఁడు గాఁగాఁ, దన్ను
బడినాయఁగాక యిది పైయద్దికములా
(||pallavi||)
ūrage gaḍiṁchugŏnī noyammā | tana-
nore ghanamu sesīno sūḍarammā
(||||)
tanivāra nŏgamām̐ṭu tappaga sūsidi niṁte
vĕnaga tanasem̐tagu vĕṁgĕmā yidi
nanubaina dānam̐gāna navvide niṁte kāga
sĕnagedanado gelisesidinā
(||||)
vubbasaboga nene vussuraṁṭi nŏgamām̐ṭu
gŏbbunanum̐ danamīm̐di kobamā yidi
nibbarānam̐ danamām̐ṭe nijamaṁṭim̐gāga nenu
dabbaralu sesinaṭṭi talam̐pā yidi
(||||)
kaḍum̐damagānam̐ dannum̐ gām̐giḍa niṁchidim̐gāga
suḍigŏnna tanagām̐ka sūsuḍā yidi
yŏḍayaga śhrīveṁkaḍeśhum̐ḍu gām̐gām̐, dannu
baḍināyam̐gāga yidi paiyaddigamulā