Oorage gadimchugonee nogadogade taanu

ఊరకే గడించుకోనీ నొకటొకటే తాను
Language

(॥పల్లవి॥)
ఊరకే గడించుకోనీ నొకటొకటే తాను
రారమ్మని పిలువఁగ రానైతినా

(॥॥)
పట్టినచలముతోడఁ బదరవద్దంటిఁ గాక
యిట్టె మోవి యడిగితే నియ్యనంటినా
దిట్టతనానఁ బయ్యద తియ్యకుమనంటిఁ గాక
నట్టుకొట్టి తనతో నవ్వనంటినా

(॥॥)
పల్లదపుమాటలకుఁ బగచాటితిఁగాక
చెల్లఁబోఁతాఁ జెప్పినట్టు సేయనైతినా
వొల్లకొల్లకుండఁగానే వొడఁబడనైతిఁ గాక
తొల్లింటివలెనే అఇతే తుదకెక్కనా

(॥॥)
పయ్యదకొంగు దియ్యఁగా బలిమిచూపితిఁ గాక
వొయ్యనే రతులకు నోపనంటినా
యియ్యెడ శ్రీ వేంకటేశుఁడింతసేసి కూడెఁగాక
నెయ్యమున నపుడే నేఁ దనుఁ బిలువనా

(||pallavi||)
ūrage gaḍiṁchugonī nŏgaḍŏgaḍe tānu
rārammani piluvam̐ga rānaidinā

(||||)
paṭṭinasalamudoḍam̐ badaravaddaṁṭim̐ gāga
yiṭṭĕ movi yaḍigide niyyanaṁṭinā
diṭṭadanānam̐ bayyada tiyyagumanaṁṭim̐ gāga
naṭṭugŏṭṭi tanado navvanaṁṭinā

(||||)
palladabumāḍalagum̐ bagasāḍidim̐gāga
sĕllam̐bom̐tām̐ jĕppinaṭṭu seyanaidinā
vŏllagŏllaguṁḍam̐gāne vŏḍam̐baḍanaidim̐ gāga
tŏlliṁṭivalĕne a̮ide tudagĕkkanā

(||||)
payyadagŏṁgu diyyam̐gā balimisūbidim̐ gāga
vŏyyane radulagu nobanaṁṭinā
yiyyĕḍa śhrī veṁkaḍeśhum̐ḍiṁtasesi kūḍĕm̐gāga
nĕyyamuna nabuḍe nem̐ danum̐ biluvanā