Oorage doorevugaaga voddanunna vaarini

ఊరకే దూరేవుగాక వొద్దనున్న వారిని
Language

(॥పల్లవి॥)
ఊరకే దూరేవుగాక వొద్దనున్న వారిని
సారె సారె నీవేల జంకించేవయ్యా

(॥॥)
మరిగించి మరగునుఁ మాట లాకె యాడఁ గాను
గరిమఁ బంజరాల చిలుకలు నేర్చెను
సొరిదినీకామినులు సుద్దులెల్లాను వినిరి
ఇరవై నీచెలిక తై లేమి సేయరయ్య

(॥॥)
మోవితేనె చెలియ నీమోవికి నందియ్యఁగాను
పావురాలు నేరుచుక పచ్చి సేసెను
యీవలావలానున్న ఇంతులెల్లాఁ దెలిసిరి
వావిరి నూడిగములవా రేలచెప్పేరయ్యా

(॥॥)
అలమేలుమంగ నీపైనటు పాటలువాడఁ గా
యెలమి గోవిల నేర్చె నీపాటలు
కలసినమీకూటమి కాంతలెల్లా నెరిఁగిరి
మెలగి శ్రీ వేంకటేశ మేమేమి సేతుమయ్యా

(||pallavi||)
ūrage dūrevugāga vŏddanunna vārini
sārĕ sārĕ nīvela jaṁkiṁchevayyā

(||||)
marigiṁchi maragunum̐ māḍa lāgĕ yāḍam̐ gānu
garimam̐ baṁjarāla silugalu nersĕnu
sŏridinīgāminulu suddulĕllānu viniri
iravai nīsĕliga tai lemi seyarayya

(||||)
movidenĕ sĕliya nīmovigi naṁdiyyam̐gānu
pāvurālu nerusuga pachchi sesĕnu
yīvalāvalānunna iṁtulĕllām̐ dĕlisiri
vāviri nūḍigamulavā relasĕpperayyā

(||||)
alamelumaṁga nībainaḍu pāḍaluvāḍam̐ gā
yĕlami govila nersĕ nībāḍalu
kalasinamīgūḍami kāṁtalĕllā nĕrim̐giri
mĕlagi śhrī veṁkaḍeśha mememi sedumayyā