ఊరకే బాఁతిపడి వొడివట్టీఁ గాక మమ్ము
(॥పల్లవి॥)
ఊరకే బాఁతిపడి వొడివట్టీఁ గాక మమ్ము
ఆ రీతి సతులమీఁది యాసలేలే తనకు
(॥॥)
బత్తితో వలచినాకె పానుపుపై నుండఁగాను
హత్తి నన్నేల చెనకీ నప్పటిఁ దాను
యిత్తలఁ దొలుతటాపె యెదురులు చూడఁగాను
కొత్తమగువలతోడి గొడవేలే తనకు
(॥॥)
సేసవెట్టిన వనిత చెంగటనే వుండఁగాను
వేసరక నాతో నవ్వీనే తాను
యీసరిఁ జేతికి లోనయిన దిట్టే వుండఁగాను
వాసు లెంచేవారితోడి వలపేలే తనకు
(॥॥)
కానుకలిచ్చిన యాపె కట్టెదుట నుండఁగాను
పూని వచ్చి నన్నుఁ గూడి పొదిగీఁ దాను
తానే శ్రీవేంకటేశుఁడు మేనముద్దరాలుండఁగా
నానా కాంతలతోడి నను పేలే తనకు
(||pallavi||)
ūrage bām̐tibaḍi vŏḍivaṭṭīm̐ gāga mammu
ā rīdi sadulamīm̐di yāsalele tanagu
(||||)
battido valasināgĕ pānububai nuṁḍam̐gānu
hatti nannela sĕnagī nappaḍim̐ dānu
yittalam̐ dŏludaḍābĕ yĕdurulu sūḍam̐gānu
kŏttamaguvaladoḍi gŏḍavele tanagu
(||||)
sesavĕṭṭina vanida sĕṁgaḍane vuṁḍam̐gānu
vesaraga nādo navvīne tānu
yīsarim̐ jedigi lonayina diṭṭe vuṁḍam̐gānu
vāsu lĕṁchevāridoḍi valabele tanagu
(||||)
kānugalichchina yābĕ kaṭṭĕduḍa nuṁḍam̐gānu
pūni vachchi nannum̐ gūḍi pŏdigīm̐ dānu
tāne śhrīveṁkaḍeśhum̐ḍu menamuddarāluṁḍam̐gā
nānā kāṁtaladoḍi nanu pele tanagu