Oorage alugagu nee voyayyaa

ఊరకే అలుగకు నీ వోయయ్యా
Language

(॥పల్లవి॥)
ఊరకే అలుగకు నీ వోయయ్యా
ఆరితేరినమాట నిన్నంటి నింతేకాక

(॥ఊర॥)
కపటములెల్లాఁ బాసె కన్నులఁ గన్నంతలోనె
వుపమలు చెప్పవయ్య వోయయ్యా
చపలచిత్తుఁడవా జడిసేటివాఁడవా
అపురూపముగనేమో అంటి నింతేకాక

(॥ఊర॥)
పట్టికు నీవంతయెగ్గు పనిలేనిపనులకు
వొట్టుక నవ్వఁగదయ్య వోయయ్యా
వెట్టివలపా నీది వేసట నీకున్నదా
అట్టునిట్టు యేఁటికో నిన్నంటి నింతేకాక

(॥ఊర॥)
కోరిక లీడేరె నిన్నుఁ గూడినయంతటిలోనే
వూరటసేసుకోవయ్య వోయయ్యా
యీరీతి శ్రీవేంకటేశ యిన్నిటా జాణవౌదువు
ఆరసి నిన్నూరకె అంటి నింతేకాక

(||pallavi||)
ūrage alugagu nī voyayyā
āriderinamāḍa ninnaṁṭi niṁtegāga

(||ūra||)
kabaḍamulĕllām̐ bāsĕ kannulam̐ gannaṁtalonĕ
vubamalu sĕppavayya voyayyā
sabalasittum̐ḍavā jaḍiseḍivām̐ḍavā
aburūbamuganemo aṁṭi niṁtegāga

(||ūra||)
paṭṭigu nīvaṁtayĕggu panilenibanulagu
vŏṭṭuga navvam̐gadayya voyayyā
vĕṭṭivalabā nīdi vesaḍa nīgunnadā
aṭṭuniṭṭu yem̐ṭigo ninnaṁṭi niṁtegāga

(||ūra||)
koriga līḍerĕ ninnum̐ gūḍinayaṁtaḍilone
vūraḍasesugovayya voyayyā
yīrīdi śhrīveṁkaḍeśha yinniḍā jāṇavauduvu
ārasi ninnūragĕ aṁṭi niṁtegāga