Ooragaide ninnum gaana mogagaaranaanam gaani

ఊరకైతే నిన్నుఁ గాన మొకకారణానఁ గాని
Language

(॥పల్లవి॥)
ఊరకైతే నిన్నుఁ గాన మొకకారణానఁ గాని
పూరిజీవులము, నీవు పురుషోత్తముఁడవు

(॥ఊర॥)
అసురలు భువిఁ బుట్టుటది వుపకారమే
అసురలు బాధింతు రమరులను
పొసఁగ వారికిఁగాను పూనుకవచ్చి నీవు
వసుధ జనించితేను వడి నిన్నుఁ గందుము

(॥ఊర॥)
అడరి ధర్మము చెడి యధర్మమైనా మేలు
వెడఁగు మునులు విన్నవింతురు నీకు
తడవి ధర్మము నిల్ప ధరణిఁ బుట్టుదు నీవు
బడి నిన్ను సేవించి బ్రదుకుదు మపుడే

(॥ఊర॥)
నీకంటే మాకుఁ జూడ నీదాసులే మేలు
పైకొని వారున్నచోటఁ బాయకుందువు
చేకొని శ్రీవేంకటేశ చెప్పఁగానే వారిచేత
నీకథలు విని విని నే మీడేరితిమి

(||pallavi||)
ūragaide ninnum̐ gāna mŏgagāraṇānam̐ gāni
pūrijīvulamu, nīvu puruṣhottamum̐ḍavu

(||ūra||)
asuralu bhuvim̐ buṭṭuḍadi vubagārame
asuralu bādhiṁtu ramarulanu
pŏsam̐ga vārigim̐gānu pūnugavachchi nīvu
vasudha janiṁchidenu vaḍi ninnum̐ gaṁdumu

(||ūra||)
aḍari dharmamu sĕḍi yadharmamainā melu
vĕḍam̐gu munulu vinnaviṁturu nīgu
taḍavi dharmamu nilba dharaṇim̐ buṭṭudu nīvu
baḍi ninnu seviṁchi bradugudu mabuḍe

(||ūra||)
nīgaṁṭe māgum̐ jūḍa nīdāsule melu
paigŏni vārunnasoḍam̐ bāyaguṁduvu
segŏni śhrīveṁkaḍeśha sĕppam̐gāne vāriseda
nīgathalu vini vini ne mīḍeridimi