ఊడిగేలవారమట వొద్దనే వుండఁగరాదా
(॥పల్లవి॥)
ఊడిగేలవారమట వొద్దనే వుండఁగరాదా
యీడనేల సిగ్గువడే వియ్యకొనరాదా
(॥॥)
సారె సారె నాపె నీతో జాణతనాలాడఁగాను
నారుకొన నేమందుకు నవ్వఁగరాదా
కూరిమిఁగొసరి నిన్నుఁ గొంగువట్టి తియ్యఁగాను
గారవించి నేమందుకు గతి గూడరాదా
(॥॥)
తనివోక ఆపె నిన్నుఁ దప్పకిట్టే చూడఁగాను
మనసిచ్చి నేమును సమ్మతించరాదా
చెనకుచుఁ గమ్మటి నీచెక్కు నొక్కి వేఁడుకోఁగా
చనవున నందరము సంతోసించరాదా
(॥॥)
గక్కన నాపె నిన్ను కాగిలించుకొనఁగాను
మిక్కిలి మాకు నేడు మెచ్చఁగరాదా
ఇక్కువతో శ్రీవేంకటేశ మమ్ము నేలితివి
చిక్కని మోవితేనెలు చేకొనఁగరాదా
(||pallavi||)
ūḍigelavāramaḍa vŏddane vuṁḍam̐garādā
yīḍanela sigguvaḍe viyyagŏnarādā
(||||)
sārĕ sārĕ nābĕ nīdo jāṇadanālāḍam̐gānu
nārugŏna nemaṁdugu navvam̐garādā
kūrimim̐gŏsari ninnum̐ gŏṁguvaṭṭi tiyyam̐gānu
gāraviṁchi nemaṁdugu gadi gūḍarādā
(||||)
tanivoga ābĕ ninnum̐ dappagiṭṭe sūḍam̐gānu
manasichchi nemunu sammadiṁcharādā
sĕnagusum̐ gammaḍi nīsĕkku nŏkki vem̐ḍugom̐gā
sanavuna naṁdaramu saṁtosiṁcharādā
(||||)
gakkana nābĕ ninnu kāgiliṁchugŏnam̐gānu
mikkili māgu neḍu mĕchcham̐garādā
ikkuvado śhrīveṁkaḍeśha mammu nelidivi
sikkani movidenĕlu segŏnam̐garādā