Oodigebuvaaramai nemumduda gaaga

ఊడిగెపువారమై నేముండుట గాక
Language

(॥పల్లవి॥)
ఊడిగెపువారమై నేముండుట గాక
జాడెఱిఁగి నిన్నునింత జరయఁగ గలమా

(॥॥)
మదము దొలఁకేయట్టి మగువల నేలితివి
సదరమా నీతోడి సంగాతాలు
వుదుటుఁ గుచగిరుల నొరసి సాము చేసితి-
విదే నీతోఁ బెనగఁగ నింతేసికిఁ గలమా

(॥॥)
చిలుకుఁ జూపులలోనే సిగ్గులు దేరితివి
సులభమా నీతోడి చుట్టరికము
తలిరుఁబెదవులను దప్పులు దేరితివి
తలపెట్టి రతి సేసి తనుపఁగఁ గలమా

(॥॥)
గామిడి బాహులతల కాఁగిళ్ళఁ బొదలితివి
సామాన్యమా నీతోడి చయ్యాటాలు
నేమపు శ్రీవేంకటేశ నీవు నన్ను నేలితివి
దోమటి దొడికి నిన్ను దొమ్మిసేయఁ గలమా

(||pallavi||)
ūḍigĕbuvāramai nemuṁḍuḍa gāga
jāḍĕṟim̐gi ninnuniṁta jarayam̐ga galamā

(||||)
madamu dŏlam̐keyaṭṭi maguvala nelidivi
sadaramā nīdoḍi saṁgādālu
vuduḍum̐ gusagirula nŏrasi sāmu sesidi-
vide nīdom̐ bĕnagam̐ga niṁtesigim̐ galamā

(||||)
silugum̐ jūbulalone siggulu deridivi
sulabhamā nīdoḍi suṭṭarigamu
talirum̐bĕdavulanu dappulu deridivi
talabĕṭṭi radi sesi tanubam̐gam̐ galamā

(||||)
gāmiḍi bāhuladala kām̐giḽḽam̐ bŏdalidivi
sāmānyamā nīdoḍi sayyāḍālu
nemabu śhrīveṁkaḍeśha nīvu nannu nelidivi
domaḍi dŏḍigi ninnu dŏmmiseyam̐ galamā