Oodigabuvaarinela vomti naasalu remsevu

ఊడిగపువారినేల వొంటి నాసలు రేఁచేవు
Language

(॥పల్లవి॥)
ఊడిగపువారినేల వొంటి నాసలు రేఁచేవు
తాడుపడి లోలోనే తమకించి రతికి

(॥॥)
పట్టిన కాళాఁజియాపెపైఁ జేయి వేసుకొని
వొట్టుచుఁ దమ్ములమట్టే వుమిసేవు
గుట్టున నందుకు నింతి గుబగుబఁ జెమరించి
నెట్టుకొని మోహించి నివ్వెరఁగు నొందెను

(॥॥)
అడపము చెలిమీఁదనట్టె పాదాలు చాఁచుక
అడరుచు నిక్కి యాకులందుకొనేవు
తడఁబడి యాచెలి తనువెల్లాఁ బులకించి
నిడువాలుఁగన్నులను నీమోముచూచెను

(॥॥)
గిండివట్టే యాపె కుచగిరులపై నొరుగుక
అండనే చల్లని పన్నీ రారగించేవు
దండిగా శ్రీవేంకటేశ తగ నన్నుఁ గూడితివి
మెండుగా తానూఁ గూడి మెచ్చులెల్లా మెచ్చెను.

(||pallavi||)
ūḍigabuvārinela vŏṁṭi nāsalu rem̐sevu
tāḍubaḍi lolone tamagiṁchi radigi

(||||)
paṭṭina kāḽām̐jiyābĕbaim̐ jeyi vesugŏni
vŏṭṭusum̐ dammulamaṭṭe vumisevu
guṭṭuna naṁdugu niṁti gubagubam̐ jĕmariṁchi
nĕṭṭugŏni mohiṁchi nivvĕram̐gu nŏṁdĕnu

(||||)
aḍabamu sĕlimīm̐danaṭṭĕ pādālu sām̐suga
aḍarusu nikki yāgulaṁdugŏnevu
taḍam̐baḍi yāsĕli tanuvĕllām̐ bulagiṁchi
niḍuvālum̐gannulanu nīmomusūsĕnu

(||||)
giṁḍivaṭṭe yābĕ kusagirulabai nŏruguga
aṁḍane sallani pannī rāragiṁchevu
daṁḍigā śhrīveṁkaḍeśha taga nannum̐ gūḍidivi
mĕṁḍugā tānūm̐ gūḍi mĕchchulĕllā mĕchchĕnu.