Oodigabuvaaramu vooragumdevaaramu

ఊడిగపువారము వూరకుండేవారము
Language

(॥పల్లవి॥)
ఊడిగపువారము వూరకుండేవారము
జోడగు మీ సరసాలు చూచుకుండేమా

(॥ఊడి॥)
అంగన నీ మోము చూచె నందుకు నీవు నవ్వితి-
వంగములు చెమరించె నంతలో మీకు
చెంగట సురటి గొని చేరి విసరేము నేము
యెంగిలి మీరతులు నే మెఱుఁగుదుమా

(॥ఊడి॥)
వనిత చేయెత్తి మొక్కె వలపులు చల్లితివి
మనసులు సరిదాఁకె మచ్చిక మీకు
వెనుకొని నేము నట్టె విడెము లిచ్చితి మదె
అనుగు మీయేకతాలు అడిగితిమా

(॥ఊడి॥)
అలమేలుమంగ మెచ్చె ఆయాలు మీ వంటితివి
కళలు రేఁగెను శ్రీవేంకటేశ మీకు
బలిమి మీరు గూడఁగ పచ్చడము గప్పితిమి
తలఁచేమీకోరికలు తడవితిమా

(||pallavi||)
ūḍigabuvāramu vūraguṁḍevāramu
joḍagu mī sarasālu sūsuguṁḍemā

(||ūḍi||)
aṁgana nī momu sūsĕ naṁdugu nīvu navvidi-
vaṁgamulu sĕmariṁchĕ naṁtalo mīgu
sĕṁgaḍa suraḍi gŏni seri visaremu nemu
yĕṁgili mīradulu ne mĕṟum̐gudumā

(||ūḍi||)
vanida seyĕtti mŏkkĕ valabulu sallidivi
manasulu saridām̐kĕ machchiga mīgu
vĕnugŏni nemu naṭṭĕ viḍĕmu lichchidi madĕ
anugu mīyegadālu aḍigidimā

(||ūḍi||)
alamelumaṁga mĕchchĕ āyālu mī vaṁṭidivi
kaḽalu rem̐gĕnu śhrīveṁkaḍeśha mīgu
balimi mīru gūḍam̐ga pachchaḍamu gappidimi
talam̐semīgorigalu taḍavidimā