Oodigabuvaaramu voddanumdevaaramu ne

ఊడిగపువారము వొద్దనుండేవారము నే
Language

(॥పల్లవి॥)
ఊడిగపువారము వొద్దనుండేవారము నే-
మీడుజోడైనవారు మీరెరఁగరా తగవు

(॥॥)
పంతము లాకెకుఁ జెల్లు పై కొనఁగ నీకుఁ జెల్లు
పొంతనే యిద్దరికిని బువ్వము చెల్లు
కాంతల నేమడిగేరు గరిసించి గరిసించి
ఇంతేసివారు మీకెరఁగరా తగవు

(॥॥)
వెస గుట్టాపె కమరు వినయము నీకమరు
వసుధ నిద్దరికిని వల పమరు
అసురుసురగుచును అందరి కేమిచెప్పేరు
యెసగినదొరలు మీ రెరఁగరా తగవు

(॥॥)
శ్రీ వేంకటేశుఁడవు చెలి యలమేలుమంగ
దేవర లిద్దరుఁ గూడితి మీలోనే
భావించి పచ్చిగా నేమినవ్వేరు
యీవల మీరే జాణలు యెరఁగరా తగవు

(||pallavi||)
ūḍigabuvāramu vŏddanuṁḍevāramu ne-
mīḍujoḍainavāru mīrĕram̐garā tagavu

(||||)
paṁtamu lāgĕgum̐ jĕllu pai kŏnam̐ga nīgum̐ jĕllu
pŏṁtane yiddarigini buvvamu sĕllu
kāṁtala nemaḍigeru garisiṁchi garisiṁchi
iṁtesivāru mīgĕram̐garā tagavu

(||||)
vĕsa guṭṭābĕ kamaru vinayamu nīgamaru
vasudha niddarigini vala pamaru
asurusuragusunu aṁdari kemisĕpperu
yĕsaginadŏralu mī rĕram̐garā tagavu

(||||)
śhrī veṁkaḍeśhum̐ḍavu sĕli yalamelumaṁga
devara liddarum̐ gūḍidi mīlone
bhāviṁchi pachchigā neminavveru
yīvala mīre jāṇalu yĕram̐garā tagavu