Oodigabuvaaramu nee koppimchemu lonimaada

ఊడిగపువారము నీ కొప్పించేము లోనిమాట
Language

(॥పల్లవి॥)
ఊడిగపువారము నీ కొప్పించేము లోనిమాట
వేడుకఁ దెలుసుకొమ్మీ వేరె వేరె నీవు

(॥ఊడి॥)
చిలుకలు వలికీని చెవి యొగ్గి వినవయ్య
కలువలు వికసించెఁ గై కోవయ్య
చెలిమి సేసీఁ దీగెలు చేత నందుకొనవయ్య
వెల నీకుఁ జెప్పరాని విన్నప మిదయ్యా

(॥ఊడి॥)
జక్కవలు మెదలీని సరవులు చూడవయ్య
నిక్కెను మేఘ మదివో నీ వంటవయ్య
మిక్కి లద్దాలు మెరిచీ మించి నీడ చూడవయ్య
వెక్కసపు గుట్టుతోడి విన్నప మిదయ్య

(॥ఊడి॥)
వెన్నెల గాసీఁ జంద్రుఁడు వెలయఁగ మెచ్చవయ్య
సన్నల మోవిపండు చవి గొనవయ్య
నిన్ను శ్రీవెంకటేశుఁడ నీరాణివాసము గూడె
వెన్నవంటి మెత్తని విన్నప మిదయ్యా

(||pallavi||)
ūḍigabuvāramu nī kŏppiṁchemu lonimāḍa
veḍugam̐ dĕlusugŏmmī verĕ verĕ nīvu

(||ūḍi||)
silugalu valigīni sĕvi yŏggi vinavayya
kaluvalu vigasiṁchĕm̐ gai kovayya
sĕlimi sesīm̐ dīgĕlu seda naṁdugŏnavayya
vĕla nīgum̐ jĕpparāni vinnaba midayyā

(||ūḍi||)
jakkavalu mĕdalīni saravulu sūḍavayya
nikkĕnu megha madivo nī vaṁṭavayya
mikki laddālu mĕrisī miṁchi nīḍa sūḍavayya
vĕkkasabu guṭṭudoḍi vinnaba midayya

(||ūḍi||)
vĕnnĕla gāsīm̐ jaṁdrum̐ḍu vĕlayam̐ga mĕchchavayya
sannala movibaṁḍu savi gŏnavayya
ninnu śhrīvĕṁkaḍeśhum̐ḍa nīrāṇivāsamu gūḍĕ
vĕnnavaṁṭi mĕttani vinnaba midayyā