Oodigabudaananu vuvidagu neegu nenu

ఊడిగపుదానను వువిదకు నీకు నేను
Language

(॥పల్లవి॥)
ఊడిగపుదానను వువిదకు నీకు నేను
వేడుకకాఁడ మీ కత వెలయించరాదా

(॥ఊడి॥)
యీకాంతను వలపించి ఇంతసేసినయందుకు
దాకొని నీచేఁతలు తలఁచరాదా
రాక నీవిందాఁక నుండి రవ్వసేసినందుకు
నీకుఁ జేతులెత్తి మొక్కి నిలుచుండరాదా

(॥ఊడి॥)
పంతాన నీకెఁ బిలిచి పరాకైవుండినందుకు
కొంతగొంత నే నిన్నుఁ గొనేడరాదా
అంతలోఁ దలఁచుకొని ఆదరించినయందుకు
సంతోసించుకొని నిన్ను సారె మెచ్చరాదా

(॥ఊడి॥)
కమ్మర నీకెఁ గూడి గడుసుపడినందుకు
చిమ్మిరేఁగి ప్రియములు చెప్పఁగరాదా
ఇమ్ముల శ్రీవేంకటేశ యేలితివి నీదేవిని
పమ్మి మిమ్మిద్దరినిఁ దప్పకచూడరాదా

(||pallavi||)
ūḍigabudānanu vuvidagu nīgu nenu
veḍugagām̐ḍa mī kada vĕlayiṁcharādā

(||ūḍi||)
yīgāṁtanu valabiṁchi iṁtasesinayaṁdugu
dāgŏni nīsem̐talu talam̐sarādā
rāga nīviṁdām̐ka nuṁḍi ravvasesinaṁdugu
nīgum̐ jedulĕtti mŏkki nilusuṁḍarādā

(||ūḍi||)
paṁtāna nīgĕm̐ bilisi parāgaivuṁḍinaṁdugu
kŏṁtagŏṁta ne ninnum̐ gŏneḍarādā
aṁtalom̐ dalam̐sugŏni ādariṁchinayaṁdugu
saṁtosiṁchugŏni ninnu sārĕ mĕchcharādā

(||ūḍi||)
kammara nīgĕm̐ gūḍi gaḍusubaḍinaṁdugu
simmirem̐gi priyamulu sĕppam̐garādā
immula śhrīveṁkaḍeśha yelidivi nīdevini
pammi mimmiddarinim̐ dappagasūḍarādā