Oodigabu vaarellaa noddanumdaro

ఊడిగపు వారెల్లా నొద్దనుండరో
Language

(॥పల్లవి॥)
ఊడిగపు వారెల్లా నొద్దనుండరో
వేడుక యేకాంతమున వెలసీని దేవుఁడు

(॥॥)
నిలువుగోణము గట్టి నిలుచుండి పన్నీట
జలకమాడీ నదే సర్వేశుఁడు
తలపాగ చుట్టు చుట్టి తడిసూళ్ళు మేన వొత్తి
తొలఁగ కుత్తరీయముతో నున్నాఁడు దేవుఁడు

(॥॥)
కప్పురకాపు మేనఁ గలయ మెత్తించుకొంటా
చిప్పిలఁగఁ జెమరించీ శ్రీవిభుఁడు
ముప్పిరిఁ బాటలు వింటా మునులు నుతించఁగాను
దప్పిదేరి సింగారానఁ దానున్నాఁడు దేవుఁడు

(॥॥)
తట్టుపుణుఁ గలఁదుక తరి సొమ్ములు నించుక
యిట్టే యలమేల్మంగ నెదఁగట్టుక
పట్టి యారగించుకొంటా పలులోకా లేలుకొంటా
మెట్టి శ్రీవేంకటాద్రిని మెఱసీని దేవుఁడు

(||pallavi||)
ūḍigabu vārĕllā nŏddanuṁḍaro
veḍuga yegāṁtamuna vĕlasīni devum̐ḍu

(||||)
niluvugoṇamu gaṭṭi nilusuṁḍi pannīḍa
jalagamāḍī nade sarveśhum̐ḍu
talabāga suṭṭu suṭṭi taḍisūḽḽu mena vŏtti
tŏlam̐ga kuttarīyamudo nunnām̐ḍu devum̐ḍu

(||||)
kappuragābu menam̐ galaya mĕttiṁchugŏṁṭā
sippilam̐gam̐ jĕmariṁchī śhrīvibhum̐ḍu
muppirim̐ bāḍalu viṁṭā munulu nudiṁcham̐gānu
dappideri siṁgārānam̐ dānunnām̐ḍu devum̐ḍu

(||||)
taṭṭubuṇum̐ galam̐duga tari sŏmmulu niṁchuga
yiṭṭe yalamelmaṁga nĕdam̐gaṭṭuga
paṭṭi yāragiṁchugŏṁṭā palulogā lelugŏṁṭā
mĕṭṭi śhrīveṁkaḍādrini mĕṟasīni devum̐ḍu