Oodigabu selulamu voddanumdevaara mimte

ఊడిగపు చెలులము వొద్దనుండేవార మింతే
Language

(॥పల్లవి॥)
ఊడిగపు చెలులము వొద్దనుండేవార మింతే
పాడిపంతముల నీ పనులు దిద్దేమా

(॥ఊడి॥)
భావములో పలిచింత వడఁతివుండినబాగు
దేవరకే తెలుసు నంతేసి మాకేల
కావించి పెక్కుసతుల కాఁక దేరినవాఁ డవు
నీ వెరఁగవా నీకు నే విన్న వించేనా

(॥ఊడి॥)
యేచినవట్టివొట్లు యింతికాఁతాళములును
నీచిత్తమె యెరుఁగును నీతో మాకేల
చేచేత నన్నియుఁ జేసి చెల్లించుకొన్న వాఁడవు
యీచిక్కు వాపఁగ లేవా యేల మ మ్మడిగేవు

(॥ఊడి॥)
అన్నిటాఁ దగ వెరిఁగి అతివఁ గాఁగిటఁ గూడి
మన్నించి నీవె నేర్తువు మాట మాకేల
యెన్నికై శ్రీవేంకటేశ యియ్యకోలై నవాఁడవు
సన్నల మెచ్చఁగ లేవా చలమెల్లఁ దేరేను

(||pallavi||)
ūḍigabu sĕlulamu vŏddanuṁḍevāra miṁte
pāḍibaṁtamula nī panulu diddemā

(||ūḍi||)
bhāvamulo palisiṁta vaḍam̐tivuṁḍinabāgu
devarage tĕlusu naṁtesi māgela
kāviṁchi pĕkkusadula kām̐ka derinavām̐ ḍavu
nī vĕram̐gavā nīgu ne vinna viṁchenā

(||ūḍi||)
yesinavaṭṭivŏṭlu yiṁtigām̐tāḽamulunu
nīsittamĕ yĕrum̐gunu nīdo māgela
seseda nanniyum̐ jesi sĕlliṁchugŏnna vām̐ḍavu
yīsikku vābam̐ga levā yela ma mmaḍigevu

(||ūḍi||)
anniḍām̐ daga vĕrim̐gi adivam̐ gām̐giḍam̐ gūḍi
manniṁchi nīvĕ nerduvu māḍa māgela
yĕnnigai śhrīveṁkaḍeśha yiyyagolai navām̐ḍavu
sannala mĕchcham̐ga levā salamĕllam̐ derenu